
కొత్త సార్లొస్తున్నారు..
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న డీఎస్సీ–2025 తుది అంకానికి చేరుకుంది. గతంలో నిర్వహించిన పరీక్షలో పొందిన మార్కులు, రిజర్వేషన్ల ప్రామాణికం అధారంగా 680 మంది అర్హుల జాబితా ప్రభుత్వం సోమవారం విడుదల చేసింది. మరో 32 పోస్టులను భర్తీ చేయలేదు.
కడప ఎడ్యుకేషన్ : ఉమ్మడి జిల్లాలో 712 పోస్టులకు ప్రభుత్వం మెగా డీఎస్సీ నిర్వహించింది. ఇటీవల అభ్యర్థులకు సంబంధించిన సర్టిఫికెట్ల వెరిఫికేషన్ పక్రియను కడప ఎస్వీ ఇంజినీరింగ్ కళాశాలలో పూర్తి చేసింది. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో 712 పోస్టులకు గానూ, 680 మందిని ఎంపిక చేస్తూ తుది జాబితా విడుదల చేసింది. మరో 32 పోస్టులకు అర్హులైన అభ్యర్థులు లేరంటూ భర్తీ చేయకుండా మిగిల్చింది. గతంలో ఎన్ని పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేస్తే అన్నీ భర్తీ చేసేవారు. రిజర్వేషన్, రోస్టర్, మెరిట్ ప్రకారం అభ్యర్థి లేకపోతే ఆ తర్వాత అర్హత ఉన్న అభ్యర్థికి ఆ పోస్టు కేటాయించేవారు. కూటమి ప్రభుత్వం అలాకాకుండా సంబంధిత అభ్యర్థి లేకపోతే అ పోస్టును వదిలేసి తరువాత డీఎస్సీలో భర్తీ చేస్తామని చెబుతోంది. నిరుద్యోగిత పెరిగిన పరిస్థితుల్లో 32 పోస్టులు మిగిల్చడంపై అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కొలువుల్లో చేరే వారికి శిక్షణ...
కొత్తగా ఉపాధ్యాయ ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థుల కు శిక్షణ ఇచ్చేందుకు జిల్లా అధికారులు రంగం సిద్ధం చేసినట్లు తెలిసింది. ఉమ్మడి జిల్లాలో ఎంపికై న 680 మంది అభ్యర్థులకు ఈ నెల 19న అపాయింటెంట్ అ ర్డర్లు ఇవ్వనున్నట్లు సమాచారం. 22వ తేదీ నుంచి 29వ తేదీ వరకూ శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిసింది. ఎంపికైన స్కూల్ అసిస్టెంట్లు, ఫిజికల్ డైరెక్టర్లు, ఎస్‌జీటీ లకు శిక్షణ అనంతరం వారికి స్థానాలు కేటాయించి పంపనున్నారు. కొత్త ఉపాధ్యాయులంతా దసరా సెలవుల తర్వాత విధుల్లో చేరే అవకాశం ఉంది.
మోగా డీఎస్సీ అభ్యర్థుల ఎంపికకు సంబంధించి తుది ఎంపిక జాబితా rpr://apdre. apcfrr.in నందు అందుబాటులో ఉంచాం. ఈ జాబితాపై సందేహాల నివృత్తికి డీఈఓ కార్యాలయంలో హెల్ప్‌లైన్ ఏర్పాటు చేశాం, వివరాలకు 995973222209, 9948112966 నెంబర్లకు కాల్ చేసి సందేహాలు నివృత్తి చేసుకోవాలి.
– షేక్ షంషుద్దీన్, జిల్లా విద్యాశాఖ అధికారి
ఎంపికైన జాబితా వివరాలు...
సబ్జెక్టు నోటిఫైడ్ ఎంపిక
పోస్టులు చేసినవి
ఎస్‌ఏ సంస్కృతం 01 01
ఎస్‌ఏ తెలుగు 26 25
ఎస్ ఉర్దూ 07 06
ఎస్‌ఏ హింది 18 18
ఎస్‌ఏ ఇంగ్లీష్ 81 78
ఎస్ మ్యాథ్స్ 44 44
ఎస్‌ఏ మ్యాథ్స్ ఉర్దూ 01 01
ఎస్‌ఏ పీఎస్ 29 29
ఎస్‌ఏ పిఎస్ ఉర్దూ 03 01
ఎస్ బయాలజీ 52 50
ఎస్‌ఏ బయాలజీ ఉర్దూ 02 02
ఎస్‌ఏ సోసియల్ స్టడీస్ 60 58
ఎస్‌ఏ ఎస్‌ఎస్ ఉర్దూ 05 05
ఎస్‌ఏ పిఈ 82 80
ఎస్‌జిటి తెలుగు మీడియం 256 254
ఎస్‌జిటి ఉర్దూ మీడియం 45 28
మొత్తం 712 680
ఎంపిక తుది జాబితా విడుదల
డీఈఓ ఆఫీసు, కలెక్టరేట్ల వద్ద జాబితా ప్రదర్శన
జిల్లాలో 712 పోస్టులకు 680 మంది ఎంపిక
19న కొత్త ఉపాధ్యాయులకు అపాయింట్‌మెంట్ ఆర్డర్స్
ఈ నెల 22 నుంచి ఉపాధ్యాయులకు శిక్షణ?

కొత్త సార్లొస్తున్నారు..

కొత్త సార్లొస్తున్నారు..