
కురులు.. సిరులు
ఇతర రాష్ట్రాల నుంచి వ్యాపారులు
గుర్రంకొండ: అన్నమయ్య జిల్లాలో సంతాన దేవతగా ప్రసిద్ధి పొందిన శ్రీ రెడ్డెమ్మ తల్లి ఆలయంలో భక్తులు సమర్పించే తలనీలాలకు విదేశాల్లో భారీ డిమాండ్ ఉంది. ఇక్కడి నుంచి చైనాతోపాటు ఇతర దేశాలకు తలానీలాలు ఎగుమతి చేస్తుంటారు. నాణ్యమైన తలనీలాలు ఇక్కడ లభించడమే బయట దేశాల్లో డిమాండ్‌కు కారణం. ఈ నేపథ్యంలో పాటాదారులు పోటాపోటీగా వేలంలో అధిక ధర పెట్టి తలనీలాలు దక్కించుకుంటున్నారు. రెడ్డెమ్మకొండకు వచ్చే భక్తులంతా ఎక్కువగా సంతాన కోసం వచ్చేవారే. అందరూ 22 నుంచి 45 ఏళ్ల వయసులోపు మహిళలే కావడం విశేషం. ఇక్కడి ఆలయ పరిసరాల్లో పంపిణీ చేసే ఆకు పసరును సేవించి.. అమ్మవారి ఎదుట వర పడితే సంతానం కలుగుతుందని భక్తుల నమ్మకం. కోర్కెలు తీరిన మహిళలతోపాటు వారి కుటుంబ సభ్యులు అమ్మవారికి భక్తితో తలనీలాలు సమర్పిస్తుంటారు. అందరూ యుక్త వయసులో ఉన్న వారు కావడంతో.. వారి తలనీలాలు ఎంతో నాణ్యమైనవిగా ఉంటాయనేది వ్యాపారుల నమ్మకం. అందువల్ల రెడ్డెమ్మకొండలోని తలనీలాలు ఎక్కువ ధర పలుకుతుంటాయి. దీంతో ఇక్కడి ఆలయంలోని తలనీలాలకు భారీ డిమాండ్ ఉంది.
అమ్మవారి ఆలయంలో లభించే తలనీలాలకు విదేశాల్లో అధిక డిమాండ్ ఉండటంతో.. వేలం పాటలు రికార్డు స్థాయిలో పలుకుతుండటం గమనార్హం. దీంతో బయటి రాష్ట్రాల నుంచి వ్యాపారులు పెద్ద ఎత్తున తరలిరావడంతో వేలం పాటలో పోటీ బాగా పెరిగింది. తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలతోపాటు మన రాష్ట్రంలోని విజయవాడ, గుంటూరు, కర్నూలు, అనంతపురం, కృష్ణా జిల్లాల నుంచి పెద్ద ఎత్తున వ్యాపారులు తరలివస్తారు. గతంలో రూ.10 లక్షల నుంచి రూ.12 లక్షలు మాత్రమే వేలం పాట పాడేవారు. ఈ ఏడాది రూ.18.76 లక్షలకు వేలం పాటలో వ్యాపారులు పాడుకొన్నారు.
భక్తుల కురులు సిరులు కురిపిస్తున్నాయి. రెడ్డెమ్మ తల్లి ఆలయ తలనీలాలు ఎక్కువ ధర పలుకుతున్నాయి. విదేశాలకు సైతం ఎగుమతి అవుతున్నాయి. వేలంపాటలో పాటాదారులు పోటాపోటీగా పాల్గొంటున్నారు. అధిక రేటు హెచ్చించి
కై వసం చేసుకుంటున్నారు. దేవస్థానానికి ఏటా భారీ ఆదాయం సమకూరుతుండటం విశేషం.
మంచి డిమాండ్ ఉంది
అమ్మవారి ఆలయంలో భక్తులు సమర్పించే తలనీలాలకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. ఈ సారి వేలం పాటల్లో నాలుగు రాష్ట్రాలకు చెందిన వ్యాపారులు పాల్గొనడం ఇందుకు నిదర్శనం. దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా రెడ్డెమ్మకొండ తలనీలాలకు డిమాండ్ పెరిగింది.
– మంజుల,
ఈఓ, రెడ్డెమ్మకొండ
రెడ్డెమ్మకొండ తలనీలాలకుభారీ డిమాండ్
చైనాకు ఎగుమతి
రికార్డు స్థాయిలో వేలం

కురులు.. సిరులు

కురులు.. సిరులు

కురులు.. సిరులు