మయూరాలు పురివిప్ప నాట్యమా డుతుంటే.. చూసేందుకు రెండు కళ్లు చాలవు. కానీ ఇడుపులపాయలో నెమళ్లు విలాపం చెందుతుండటం.. పక్షుల ప్రేమికులను ఆందోళన కలిగిస్తోంది. సంరక్షణ, పర్యవేక్షణ లోపంతో కొన్ని మృత్యువాత పడుతుండటం విషాదకరం. పట్టించుకోవాల్సిన ప్రభుత్వం శీతకన్ను వేయ | - | Sakshi
Sakshi News home page

మయూరాలు పురివిప్ప నాట్యమా డుతుంటే.. చూసేందుకు రెండు కళ్లు చాలవు. కానీ ఇడుపులపాయలో నెమళ్లు విలాపం చెందుతుండటం.. పక్షుల ప్రేమికులను ఆందోళన కలిగిస్తోంది. సంరక్షణ, పర్యవేక్షణ లోపంతో కొన్ని మృత్యువాత పడుతుండటం విషాదకరం. పట్టించుకోవాల్సిన ప్రభుత్వం శీతకన్ను వేయ

Sep 13 2025 4:21 AM | Updated on Sep 13 2025 4:23 AM

సంరక్షణ లోపమా?

పర్యవేక్షణ లేకనా?

కడప సిటీ: ఇడుపులపాయలోని నెమళ్ల పునరుత్పత్తి, సంరక్షణ కేంద్రం (నెమళ్ల పార్కు)లో నానాటికీ నెమళ్ల సంఖ్య తగ్గిపోతుండటంతో.. పర్యాటకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జాతీయ పక్షిగా నెమలికి మన దేశంలో గుర్తింపు ఉంది. అటవీశాఖ నిబంధనల మేరకు జాతీయ జంతువు పులికి ఎంతటి ప్రాముఖ్యత ఉందో, అంతే ప్రాధాన్యతను మయూరానికి ఇవ్వాల్సి ఉంది. ప్రస్తుతం అడవుల్లో నెమళ్ల సంఖ్య తగ్గిపోతుండటంతో.. ఇలాంటి కేంద్రాన్ని మరింత శ్రద్ధతో సంరక్షించుకోవాల్సిన అవసరం ఉంది.

105 నుంచి 31కి తగ్గిన నెమళ్ల సంఖ్య

దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి 2008 డిసెంబరు 24న ఈ కేంద్రానికి శంకుస్థాపన చేశారు. రూ.50 లక్షల నిధులు కేటాయించారు. నెమళ్ల ఆరోగ్య సంరక్షణకు ఓ ఆస్పత్రి, గుడ్లను పొదిగించేందుకు ఇంక్యుబేటర్‌, ల్యాబ్‌, ఆకర్షణీయమైన షెడ్లు ఏర్పాటు చేశారు. ఆ సమయంలో 72 నెమళ్లు (10 మగ నెమళ్లు, ఆడ నెమళ్లు 29, మిగిలినవి పిల్లలు) ఉన్నాయి. ఆ తర్వాత ఇందులో నెమళ్ల సంఖ్య 105కి చేరింది. దాదాపు ఇక్కడ పెంచి పోషించిన నెమళ్లు 400 దాకా అడవుల్లోకి వదిలే సందర్భాలు ఉన్నాయి. ప్రస్తుతం 31 నెమళ్లు మాత్రమే ఈ కేంద్రంలో ఉండటం ఆందోళన కలిగించే పరిణామం.

కోళ్ల కింద గుడ్లు పెట్టి పొదిగిస్తున్న వైనం

ప్రస్తుతం నెమళ్ల పార్కులో గుడ్లు పొదిగించే ఇంక్యుబేటర్‌ మూలకు చేరింది. నాలుగేళ్లుగా పనిచేయకపోవడంతో కోళ్ల కింద గుడ్లు పొదిగిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో పునరుత్పత్తి అంతంత మాత్రంగానే కొనసాగుతోంది. ఇది కూడా నెమళ్ల సంఖ్య తగ్గడానికి కారణంగా తెలుస్తోంది. రూ.2 లక్షల ఖరీదు చేసే ఈ ఇంక్యుబేటర్‌ను కొనకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారంటే.. ఏ మేరకు నెమళ్లపార్కు మీద శ్రద్ధ కనబరుస్తున్నారో అవగతమవుతోంది.

అటవీ శాఖ అధికారుల విచారణ

ఈ ఏడాది జనవరిలో ఒకేసారి తొమ్మిది నెమళ్లు మృతి చెందాయి. వీటికి పోస్టుమార్టం నిర్వహించి భూమిలో పాతిపెట్టారు. ఒకేసారి ఇన్ని నెమళ్లు చనిపోవడంతో అధికారులకు అనుమానం మొదలైంది. ఎవరో విష ప్రయోగం చేశారన్న విషయం పోస్టుమార్టంలో తేలింది. ఈ నేపథ్యంలో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సీసీ కెమెరాలు లేకపోవడంతో ఎవరు చేశారన్నది గుర్తించడంలో ఇబ్బందిగా మారింది. ఎవరైనా చెడ్డపేరు తెచ్చేందుకు చేశారా? అనే అనుమానంతో అధికారులు ఉన్నారు.

కుందేళ్లు, లవ్‌బర్డ్స్‌ కూడా లేవు

ఇడుపులపాయ నెమళ్ల పార్కులో నెమళ్లే కాకుండా 25 లవ్‌ బర్డ్స్‌, 20 కుందేళ్లు కూడా ఉండేవి. ప్రస్తుతం అవి కూడా మృతి చెందినట్లు తెలుస్తోంది. సంరక్షణ సరిగా లేకపోవడంతోనే ఈ పరిస్థితి ఎదురైనట్లు పర్యాటకులు చెబుతున్నారు.

తెలుగు రాష్ట్రాలకు ఒకే ఒక పునరుత్పత్తి కేంద్రం

రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి నెమళ్ల పునర్పత్తి కేంద్రం, సంరక్షణ కేంద్రం ఇదొక్కటే ఉంది. ఇలాంటి కేంద్రాన్ని తెచ్చుకోవాలంటే కేంద్ర ప్రభుత్వం అనుమతి లేనిదే ఏర్పాటు చేసుకోవడం చాలా కష్టమైన పని. అందువల్ల దీనిని అతి జాగ్రత్తగా సంరక్షించుకోవాల్సిన అవసరం ఉంది.

ఒకానొక దశలో ఎత్తివేసే యత్నం

దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి నెలకొల్పిన ఈ నెమళ్ల పార్కును ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు గతంలో ఇక్కడ లేకుండా ఎత్తివేసే ప్రయత్నం చేశారు. 2016లో ట్రిపుల్‌ ఐటీలో కాన్వోకేషన్‌ కార్యక్రమానికి హాజరైనపుడు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అప్పట్లో నిధులు లేని కారణంగా మూసివేత దిశగా ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ కేంద్రాన్ని తీసివేసి అటవీశాఖ అతిథి గృహంగా మార్చాలన్న నిర్ణయానికి కూడా అప్పట్లో వచ్చినట్లు తెలిసింది. ఈ విషయాన్ని 2016 డిసెంబరు 21న సాక్షి ‘పాపం మయూరం’ శీర్షికన కథనం ప్రచురించడంతో.. ఎక్కడ చెడ్డపేరు వస్తుందన్న ఉద్దేశంతో ఈ నిర్ణయాన్ని విరమించుకున్నారు.

ఇడుపులపాయ నెమళ్ల పార్కులో నానాటికీ నెమళ్ల సంఖ్య తగ్గిపోతున్న నేపథ్యంలో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సంరక్షించే వారు లేకపోవడమా? లేక పర్యవేక్షణ లోపమా? అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. సక్రమమైన సంరక్షణ ఉంటే నెమళ్లు ఎందుకు పునరుత్పత్తి కావడం లేదని పర్యాటకులు ప్రశ్నిస్తున్నారు. సరిగా వాటికి పోషకాహారాన్ని పెడుతూ సంరక్షించుకుంటూ వెళ్లడం లేదన్న విమర్శలు ఉన్నాయి. అయితే అధికారులు మాత్రం అన్ని సక్రమంగానే ఉన్నాయని చెబుతున్నారు. నిధులు ఆలస్యంగా ప్రభుత్వం నుంచి అందుతున్నా.. ఇబ్బందులు లేవంటున్నారు.

ఇడుపులపాయ నెమళ్ల పునరుత్పత్తి కేంద్రంపై నిర్లక్ష్యం

తగ్గిపోతున్న మయూరాల సంఖ్య

విష ప్రయోగంతో ఒకే సారి 9 మృతి

మూలనపడిన ఇంక్యుబేటర్‌

సంఖ్య పెంచేందుకు చర్యలు

నెమళ్లపార్కులో నెమళ్ల సంఖ్య పెంచేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం. కొత్త ఇంక్యుబేటర్‌ కోసం నివేదికలు ప్రభుత్వానికి పంపించడం జరిగింది. త్వరలోనే వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం కోళ్ల కింద గుడ్లను పొదిగించి పునరుత్పత్తి చేస్తున్నాం. తొమ్మిది నెమళ్లు మృతి చెందిన విషయంపై కేసు నమోదుతోపాటు విచారణ ప్రారంభించాం. త్వరలో నిందితులను పట్టుకుంటాం. సీసీ కెమెరాలను త్వరలోనే ఏర్పాటు చేస్తున్నాం.

–బాలసుబ్రమణ్యం, అటవీ అధికారి, వేంపల్లె

పార్కును సంరక్షించుకోవాలి

నెమళ్లపార్కుపై అధికారులు చర్యలు చేపట్టి సంరక్షించాల్సిన అవసరం ఉంది. నెమళ్ల సంఖ్య తగ్గిపోకుండా పునరుత్పత్తి చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నెమళ్లపార్కు ఒక పర్యాటక కేంద్రంగా మారడంతో దీన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టాలి. – యు.చంద్ర ఓబుల్‌రెడ్డి, వేంపల్లె

పర్యాటకుల్లో ఆందోళన

నెమళ్ల పార్కులో నెమళ్ల సంఖ్య తగ్గిపోవడంతో పర్యాటకులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ప్రధానంగా గండి వీరాంజనేయస్వామిని దర్శించుకునే వారంతా ఇడుపులపాయకు వస్తున్నారు. అక్కడ నెమళ్లను చూసి చిన్న పిల్లలు ఆనందంతో కేరింతలు వేస్తారు. ఇలాంటి కేంద్రాన్ని సంరక్షించుకోవాల్సిన అవసరం ఉంది. – కొండారెడ్డి, వేంపల్లె

మయూరాలు పురివిప్ప నాట్యమా డుతుంటే.. చూసేందుకు రెండు కళ్1
1/6

మయూరాలు పురివిప్ప నాట్యమా డుతుంటే.. చూసేందుకు రెండు కళ్

మయూరాలు పురివిప్ప నాట్యమా డుతుంటే.. చూసేందుకు రెండు కళ్2
2/6

మయూరాలు పురివిప్ప నాట్యమా డుతుంటే.. చూసేందుకు రెండు కళ్

మయూరాలు పురివిప్ప నాట్యమా డుతుంటే.. చూసేందుకు రెండు కళ్3
3/6

మయూరాలు పురివిప్ప నాట్యమా డుతుంటే.. చూసేందుకు రెండు కళ్

మయూరాలు పురివిప్ప నాట్యమా డుతుంటే.. చూసేందుకు రెండు కళ్4
4/6

మయూరాలు పురివిప్ప నాట్యమా డుతుంటే.. చూసేందుకు రెండు కళ్

మయూరాలు పురివిప్ప నాట్యమా డుతుంటే.. చూసేందుకు రెండు కళ్5
5/6

మయూరాలు పురివిప్ప నాట్యమా డుతుంటే.. చూసేందుకు రెండు కళ్

మయూరాలు పురివిప్ప నాట్యమా డుతుంటే.. చూసేందుకు రెండు కళ్6
6/6

మయూరాలు పురివిప్ప నాట్యమా డుతుంటే.. చూసేందుకు రెండు కళ్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement