
పత్రికా స్వేచ్ఛను హరించడం తగదు
పత్రికా స్వేచ్ఛను హరించేలా కూటమి ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోంది. రాజ్యాంగం కల్పించిన వాక్ స్వాతంత్య్రాన్ని హరిస్తోంది. పోలీసులతో కేసులు పెట్టిస్తూ భయపెట్టాలని చూస్తోంది. ఇటీవల ఒక నాయకుడి ప్రెస్‌మీట్ కవర్ చేసినందుకు కేసు పెట్టడం దుర్మార్గం. పత్రికా స్వేచ్ఛకు విఘా తం కలిగేలా, ప్రజాస్వామ్య విలువలకు భంగం వాటిల్లేలా వ్యవహరించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. వెంటనే సాక్షి ఎడిటర్ ధనుంజయరెడ్డిపై పెట్టిన కేసును ఎత్తివేయాలి.
–వైఎస్ అవినాష్‌రెడ్డి, ఎంపీ, కడప
కక్షపూరితం..దుర్మార్గం
పత్రికా స్వేచ్ఛ అనేది భావ ప్రకటన స్వేచ్ఛ అని ప్రభుత్వంలో ఉన్న వారికి తెలియంది కాదు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 (1)ఏ ప్రసాదించింది. ప్రజల గొంతుకై న పత్రిక పట్ల, పత్రిక ఎడిటర్ పట్ల కక్షపూరితంగా వ్యవహరించడం అత్యంత దుర్మార్గం. ప్రజాస్వామ్యానికి ఏమాత్రం ఇది మంచిది కాదు. పత్రికలో వచ్చే వార్త లేదా కథనంలో ఏవైనా అభ్యంతరాలు ఉంటే ప్రెస్ కౌన్సిల్‌కు ఫిర్యాదు చేసుకోవచ్చు. లేదా రిజాయిండర్ ఇవ్వవచ్చు. దానికి స్పందించకపోతే పరువునష్టం దావా వేసుకోవచ్చు. అంతేకాని భయపెట్టి తన దారిలోకి తెచ్చుకోవాలనే కుతంత్రంతో తప్పుడు కేసులు పెట్టడాన్ని సమాజం హర్షించదు.
– మేడా రఘునాథరెడ్డి, రాజ్యసభసభ్యుడు

పత్రికా స్వేచ్ఛను హరించడం తగదు

పత్రికా స్వేచ్ఛను హరించడం తగదు