
భక్తిశ్రద్ధలతో ఆరోగ్యమాత ఉత్సవాలు
కడప సెవెన్‌రోడ్స్ : కడప నగరంలోని ఆరోగ్యమాత ఉత్సవాల్లో భాగంగా శనివారం 9వ రోజున నవదిన పూజా కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. నల్గొండ డాన్‌బాస్కో ప్రిన్సిపాల్ తాళ్ల విల్సన్ సందేశాన్ని అందజేశారు. తొలుత అలంకరించిన పల్లకీపై మరియమాత స్వరూపాన్ని ఉంచి చర్చి ప్రాంగణంలో విశ్వాసులు స్తుతి గీతాలు ఆలపిస్తూ ప్రదక్షిణలు నిర్వహించారు. ఈ సందర్భంగా గురువులు ఆరోగ్యమాత సందేశాన్ని వినింపించారు. భక్తులు స్తుతి గీతాలు ఆలపించారు. తేరు, దివ్య బలిపీఠాలను అలంకరించారు. ఈ కార్యక్రమంలో ఫాదర్ ఎండీ ప్రసాద్‌రావు, ప్రెసిడెంట్ విక్టర్, కార్యదర్శి సెబాస్టియన్, ఆర్థిక కార్యదర్శి ఆనందరావు, డేవిడ్, ఆంథోని, జార్జి, రాజేంద్ర, మణి, జయరాజుతోపాటు పలువురు విశ్వాసులు పాల్గొన్నారు.