
ఉత్సాహంగా రాష్ట్రస్థాయి సూపర్ సెవెన్ క్రికెట్ పోటీలు
ప్రొద్దుటూరు కల్చరల్ : స్థానిక అనిబిసెంట్ మున్సిపల్ హైస్కూల్‌లో శనివారం ఆంధ్రప్రదేశ్ సూపర్ సెవెన్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి 4వ సూపర్ సెవెన్ అండర్–23 యూత్ క్రికెట్ పోటీలు ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి 11 టీంలు ఈ పోటీల్లో పాల్గొన్నాయి. పోటీలను ప్రారంభించిన సీమాంధ్ర బీసీ సంక్షేమం సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు చల్లా రాజగోపాల్ మాట్లాడుతూ క్రీడాకారులు నిత్యం క్రీడా సాధన చేసి రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో రాణించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో యూత్ క్రికెట్ క్లబ్ అధ్యక్షుడు మార్తల సుధాకర్‌రెడ్డి, పాఠశాల ఇన్‌చార్జి ప్రధానోపాధ్యాయుడు నాగార్జునరెడ్డి, రాష్ట్ర సూపర్ సెవెన్ క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ దేవేంద్ర, నంద్యాల జిల్లా సెక్రటరీ కిరణ్, అన్నమయ్య జిల్లా సెక్రటరీ మురళీ, పలు జిల్లాల కార్యదర్శులు, వ్యాయామ ఉపాధ్యాయుడు ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.