
పంటల సాగులో రైతులకు తోడ్పాటునందించాలి
కడప అగ్రికల్చర్ : పంటల సాగులో రైతులకు కావాల్సిన సూచనలు, సలహాలను అధికారులు అందించి రైతుల అభివృద్ధికి కృషి చేయాలని ఊటుకూరు వ్యవసాయ పరిశోధన కేంద్రం ప్రిన్సిపల్ సైంటిస్టు డాక్టర్ ప్రభాకర్‌రెడ్డి పేర్కొన్నారు. కడప నగర శివార్లలోని ఊటుకూరు పరిశోధన కేంద్రంలో శనివారం సమావేశం నిర్వహించారు. జిల్లా జేడీఏ, జిల్లా ఏడీఏలు, వ్యవసాయ శాస్త్రవేత్తలు, కేవీకే ప్రోగ్రాం కోఆర్డినేటర్ తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌లో జిల్లాలో సాగుచేస్తున్న పంటల వృద్ధి దశలు, వాటిలో ఉత్పన్నమవుతున్న సమస్యల గురించి చర్చించారు.
వ్యవసాయ పరిశోధన స్థానం ప్రిన్సిపల్
సైంటిస్టు ప్రభాకర్‌రెడ్డి