
పిల్లల రక్షణ చట్టాల అమలుపై సమీక్ష
కడప అర్బన్ : రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ డాక్టర్ సి.యామిని, సీనియర్ సివిల్ జడ్జి, జిల్లా న్యాయసేవాధికార సంస్థ సెక్రటరీ ఎస్. బాబా ఫకృద్దీన్ ఆధ్వర్యంలో శనివారం కడపలోని కోర్టు ప్రాంగణంలో గల న్యాయ సేవా సదన్‌లో శ్రీబాలల న్యాయం, పిల్లల రక్షణ చట్టాల అమలులో సమస్యలు, సవాళ్ల్ఙు మొదలగు అంశాలపై జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి డాక్టర్ సి. యామిని మాట్లాడుతూ శ్రీబాలల న్యాయం, జేజేబీ చట్టం 2015, పోక్సో చట్టం 2012, పీసీఎంఏ 2006, బాల కార్మిక (నిషేధ మరియు నియంత్రణ) చట్టం 1986, పీసీ మరియు పీఎన్‌డీటీ చట్టం 1994, ఆర్టీఈ 2009, హెచ్‌ఏఎంఏ చట్టం 1956, ఆంధ్రప్రదేశ్ పంచాయతీ వికాస చట్టం 1977, ఎంటీపీ చట్టం 2021, అంగీకారాలు ఉన్న వ్యక్తుల హక్కుల చట్టం 2016 మొదలగు చట్టాల అమలులో సమస్యలు, సవాళ్లు మొదలు అంశాలపై వివరించారు. శాఖల వారీగా సమస్యలు, సవాళ్లు అంశాలను ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు. బాల్య వివాహాలు, గర్భధారణ, పిల్లల ఆరోగ్యం, విద్య, పునరావాసం, ప్రభుత్వ పథకాలు, దూరప్రాంతాల పిల్లల సదుపాయాలు అనే అంశాలను వివరించారు. లీగల్ సర్వీసెస్ హెల్ప్ లైన్ నెంబర్ 15100, చైల్డ్ హెల్ప్ లైన్ నెంబర్ 1098, దివ్యాంగ జన్ హెల్ప్ లైన్ నెంబర్ 14456 అంశాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఫస్ట్ అడిషనల్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ కడప కం జ్యువెనల్స్ బోర్డ్ ప్రిన్సిపల్ మెజిస్ట్రేట్ కె. భార్గవి, జిల్లాలో వివిధ విభాగాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.