
నెల్లూరు జట్టు ఘన విజయం
ఆదిల్ హుస్సేన్, కడప
(58 పరుగులు)
అఖిల్, నెల్లూరు
(3 వికెట్లు)
శివ కేశవ, కడప
(66 పరుగులు)
నారాయణ, నెల్లూరు
(3 వికెట్లు)
కడప వైఎస్‌ఆర్ సర్కిల్ : ఏసీఏ అండర్–23 మల్టీ మ్యాచ్‌లు శుక్రవారం మూడవ రోజు అనంతపురం జట్టుపై నెల్లూరు జట్టు ఘన విజయం సాధించింది. కెఎస్‌ఆర్‌ఎం క్రికెట్ మైదానంలో జరిగిన మ్యాచ్‌లో 14 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో రెండవ ఇన్నింగ్స్ ప్రారంభించిన అనంతపురం జట్టు 48.1 ఓవర్లలో 187 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ జట్టులోని భార్గవ్ రాజు 45 పరుగులు, అర్జున్ టెండూల్కర్ 44 పరుగులు చేశారు. నెల్లూరు జట్టులోని నారాయణ 3 వికెట్లు, అఖిల్ 3 వికెట్లు తీశారు. దీంతో నెల్లూరు జట్టు 160 అధిక్యంతో విజయం సాధించింది. కాగా నెల్లూరు జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 239 పరుగులు, రెండవ ఇన్నింగ్స్‌లో 350 పరుగులు చేసింది. అనంతపురం జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 242 పరుగులు, రెండవ ఇన్నింగ్స్‌లో 187 పరుగులు చేసిన విషయం తెలిసిందే.
డ్రాగా ముగిసిన కడప–కర్నూలు మ్యాచ్ :
వైఎస్‌ఆర్‌ఆర్ ఏసీఏ క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న కడప–కర్నూలు జట్ల మధ్య మ్యాచ్‌లో రెండవ ఇన్నింగ్స్ ప్రారంభించిన కడప జట్టు 80 ఓవర్లకు 8 వికెట్లు కోల్పోయి 297 పరుగులు చేసింది. ఆ జట్టులోని శివ కేశవ 66 పరుగులు, ఆదిల్ హుస్సేన్ 58 పరుగులు చేశారు. కర్నూలు జట్టులోని సాయి సూర్యతేజ రెడ్డి 4 వికెట్లు తీశాడు. అనంతరం రెండవ ఇన్నింగ్స్ ప్రారంభించిన కర్నూలు జట్టు 4 ఓవర్లకు 40 పరుగులు చేసింది. దీంతో కడప–కర్నూలు జట్ల మధ్య మ్యాచ్ డ్రాగా ముగిసింది. కాగా కడప జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 304 పరుగులు, రెండవ ఇన్నింగ్స్‌లో 297 పరుగులు చేసింది. కర్నూలు జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 314 పరుగులు, రెండవ ఇన్నింగ్స్‌లో 40 పరుగులు మాత్రమే చేసింది. ఈ మ్యాచ్‌లో కడప జట్టు తొలి ఇన్నింగ్స్‌లో అధిక్యంతో ఉండటంతో 03 పాయింట్లు లభించాయి.

నెల్లూరు జట్టు ఘన విజయం

నెల్లూరు జట్టు ఘన విజయం

నెల్లూరు జట్టు ఘన విజయం