
ఒంటిమిట్టలో మందుబాబుల వీరంగం
● చిల్లర దుకాణంపై పెట్రోల్‌తో దాడి
● చిల్లర బాకీ అడిగినందుకు
ఘాతుకానికి దిగిన మందుబాబులు
ఒంటిమిట్ట : బాకీ అడిగాడని చిల్లర దుకాణంపై మందుబాబులు పెట్రోల్ పోసి దాడి చేశారు. బాధితుల వివరాల మేరకు..చిన్న కొత్తపల్లికి చెందిన కట్టా మల్లికార్జున అనే వ్యక్తి ఒంటిమిట్టలోని కల్యాణ్ రామ్ టౌన్ షిప్ వద్ద ఉన్న పట్నం పెంచలయ్య చిల్లర దుకాణంలో చిల్లర బాకీ చేసి ఉన్నాడు. శుక్రవారం మధ్యాహ్నం 2:50 గంటలకు కట్టా మల్లికార్జున పెంచలయ్య చిల్లర దుకాణానికి వచ్చాడు. మల్లికార్జున రావడంతో దుకాణాదారుడు పెంచలయ్య తనకు బాకీ ఉన్న చిల్లర తిరిగి ఇవ్వాలని అడిగాడు. ఎంత ఉందని మల్లికార్జున పెంచలయ్యను ప్రశ్నించాడు. రూ. 170 బాకీ ఉందడని చెప్పగా నువ్వు రూ. 100 అబద్ధం చెబుతున్నావు. నేను బాకీ రూ.70 మాత్రమే ఉన్నానని దుకాణాదారుడు పెంచలయ్యపై మద్యం మత్తులో ఉన్న కట్టా మల్లికార్జున దాడి చేశాడు. దీంతో దెబ్బలు తిన్న దుకాణాదారుడు స్థానిక పోలీసు స్టేషన్‌లో పిర్యాదు చేశాడు. తనపై పోలీసులకు ఫిర్యాదు చేశాడని తెలుసుకున్న మద్యం మత్తులో ఉన్న కట్టా మల్లికార్జున ఆగ్రహావేశంతో కట్టా బాలకృష్ణా అనే వ్యక్తితో కలిసి సాయంత్రం 4:50 గంటలకు వచ్చి, పెట్రోల్ పోసిన ప్యాకెట్లను పెంచలయ్య దుకాణంపై విసిరి, దుకాణానికి నిప్పుపెట్టి పారిపోయారు. వెంటనే స్పందించిన దుకాణాదారులు, స్థానికులు మంటల్లో కాలిపోతున్న దుకాణంపై నీరు పోసి మంటలను ఆర్పివేశారు. ఈ ఘటనలో బాధితుడు పెంచలయ్య దుకాణంలో రూ. 45 వేల ఆస్తి నష్టం జరిగిందని బాధితులు వాపోతున్నారు. తనకున్న బాకీ అడిగినందుకు తనకున్న జీవనాదారమైన దుకాణంపై దాడిచేయడం ఆమానుశమని, ఇంతటి దౌర్జన్యం, రౌడియిజం ఎన్నడు లేదని దుకాణదారుడు కన్నీటి పర్యంతం అయ్యాడు. ఇంతటి ఘాతుకానికి పాల్పడిన మందుబాబులను కఠినంగా శిక్షించాలని బాధిత దుకాణాదారుడు పోలీసులను ఆశ్రయించి, పిర్యాదు చేశానన్నా డు. ఒంటిమిట్ట పోలీసులు దాడికి గురైన దుకాణం వ ద్దకు చేరుకుని, దాడి జరిగిన ప్రదేశాన్ని, సీసీ కెమరా లో దాడికి సంబంధించి విడియోను పరిశీలించారు.