
ఉత్సాహంగా ఏసీఏ అండర్–23 మల్టీ డే మ్యాచ్‌లు
పవన్‌కుమార్, 83 పరుగులు(నెల్లూరు)
ఇకాక్‌షర్,
5 వికెట్లు(నెల్లూరు)
కనిష్, 4 వికెట్లు
(కర్నూలు)
విజయ్‌రామిరెడ్డి,
80 పరుగులు(కడప)
కడప వైఎస్‌ఆర్ సర్కిల్ : ఏసీఏ అండర్–23 మల్టీ డే మ్యాచ్‌లు రెండవ రోజు ఉత్సాహంగా కొనసాగాయి. వైఎస్‌ఆర్‌ఆర్ క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్‌లో 304 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో మ్యాచ్‌ను ప్రారంభించిన కడప జట్టు 88.4 ఓవర్లకు 9 వికెట్లు కోల్పోయి 374 పరుగులు చేసింది. ఆ జట్టులోని విజయ్ రామిరెడ్డి 80, భరత్‌రెడ్డి 37 పరుగులు చేశారు. కర్నూలు జట్టులోని కనిష్ 4, అక్షిత్‌రెడ్డి 3 వికెట్లు తీశారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన కర్నూలు జట్టు 65 ఓవర్లకు 9 వికెట్లు కోల్పోయి 261 పరుగులు చేసింది. ఆ జట్టులోని సాయిసూర్యతేజరెడ్డి 58, అక్షిత్‌రెడ్డి 47, సాయి ప్రణవ్ 51 పరుగులు చేశారు. కడప జట్టులోని చెన్నారెడ్డి 3, ఎస్‌ఎండీ ఆయూబ్ 2 వికెట్లు తీశారు. కర్నూలు జట్టు 113 పరుగుల వెనుకంజలో ఉంది.
కేఎస్‌ఆర్‌ఎం క్రికెట్ మైదానంలో..
కేఎస్‌ఆర్‌ఎం క్రికెట్ మైదానంలో జరిగిన మ్యాచ్‌లో 196 పరుగుల ఓవర్ నైట్ స్కోర్‌తో రెండవ రోజు బ్యాటింగ్‌కు దిగిన అనంతపురం జట్టు 43.3 ఓవర్లలో 242 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ జట్టులోని వెంకట్ లోకేష్ 30 పరుగులు చేశాడు. నెల్లూరు జట్టులోని ఇకాక్‌షర్ అద్భుతంగా బౌలింగ్ చేసి 5 వికెట్లు తీశాడు. నారాయణ 3, మాధవ్ 2 వికెట్లు తీశారు. అనంతరం రెండవ ఇన్నింగ్స్ ప్రారంభించిన నెల్లూరు జట్టు 60 ఓవర్లకు 350 పరుగులు చేసి అలౌట్ అయింది. ఆ జట్టులోని రోషన్ పవన్‌కుమార్ 83 పరుగులు, సూతేజ్‌రెడ్డి 81 పరుగులు చేశారు. అనంతపురం జట్టులోని ప్రమోద్ 3 వికెట్లు, టీవీ సాయి ప్రతాప్‌రెడ్డి 4 వికెట్లు తీశారు. అనంతరం రెండవ ఇన్నింగ్స్ ప్రారంభించిన అనంతపురం జట్టు 3 ఓవర్లకు తొలి వికెట్ కోల్పోయి 14 పరుగులు చేసింది. దీంతో రెండవ రోజు ఆట ముగిసింది.

ఉత్సాహంగా ఏసీఏ అండర్–23 మల్టీ డే మ్యాచ్‌లు

ఉత్సాహంగా ఏసీఏ అండర్–23 మల్టీ డే మ్యాచ్‌లు

ఉత్సాహంగా ఏసీఏ అండర్–23 మల్టీ డే మ్యాచ్‌లు