
చంద్రప్రభ వాహనంపై శ్రీరంగనాథుడు
పులివెందుల టౌన్ : పులివెందుల మున్సిపాలిటిలోని అతి పురాతనమైన శ్రీరంగనాథస్వామి ఆలయంలో నూలు పూజ పవిత్రోత్సవాల్లో భాగంగా 5వ రోజు శ్రీరంగనాథుడు చంద్రప్రభ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. అర్చకులు కృష్ణరాజేష్‌శర్మ ఉభయదారులచే ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరిపించి భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. నూలుపూజ పవిత్రోత్సవాలను ప్రతి ఏడాది వినాయక చవితి మరుసటి రోజు నుంచి 9రోజుల పాటు వైభవంగా నిర్వహించడం ఆనవాయితీ. ఈ నూలుపూజలకు భక్తులు పెద్దసంఖ్యలో స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ చైర్మెన్ చింతకుంట సుధీకర్‌రెడ్డి, ఈఓ రమణ పర్యవేక్షించారు.