
డీసీఈబీ నుంచి మండల కేంద్రాలకు చేరుకున్న ప్రశ్న పత్రాలు
ఈ నెల 11వ తేదీ నుంచి 14వ తేదీ వరకు పరీక్షలు
డీసీఈబీ నుంచి మండల కేంద్రాలకు చేరుకున్న ప్రశ్న పత్రాలు
కడప ఎడ్యుకేషన్ : విద్యార్థుల అభ్యసనా సామర్థ్యాలను అంచనా వేసేందుకు విద్యా శాఖ ఏటా ఫార్మెటివ్, సమ్మెటివ్ అసెస్‌మెంట్ పరీక్షలను నిర్వహిస్తోంది. ఈ విద్యా సంవత్సరంలో నాలుగు సెల్ఫ్ అసెస్‌మెంట్, రెండు సమ్మెటివ్ పరీక్షలను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో తొలి అసెస్‌మెంట్ మోడల్ పేపర్–1ను ఈ నెల 11వతేదీ నుంచి క్లాస్ రూమ్ బేస్డ్ అసెస్‌మెంట్‌ను విధానంలో నిర్వహించనున్నారు. గత విద్యా సంవత్సరం వరకూ 1వ తరగతి నుంచి 8వ తరగతి వరకు సీబీఏ విధానం అమలుచేయగా ఈ ఏడాది ఆ విధానాన్ని 9వ తరగతి వరకూ పొడిగించారు. కేవలం పదో తరగతి విద్యార్థులకు మాత్రమే ఫార్మేటివ్ పరీక్షలను జరపనున్నారు.
జిల్లాలో విద్యార్థుల వివరాలిలా...
జిల్లాలో 1912 ప్రభుత్వ, ఎయిడెడ్, జెడ్పీ, మున్సిపల్ యాజమాన్యాల్లో ప్రాథమిక పాఠశాలలు ఉండగా ఇందులో 96382 మంది విద్యార్థులున్నారు. 273 యూపీ స్కూల్స్‌లో 33226, 634 హైస్కూల్స్‌లో 165350 మంది విద్యార్థులు ఉన్నారు. మొత్తం 2819 పాఠశాలల్లో 2,94,958 మంది విద్యార్థులు విద్య అభ్యసిస్తున్నారు.
పరీక్షల షెడ్యూల్ ఇదీ...
ప్రాథమిక పాఠశాలల్లో 1వ తరగతి నుంచి 5వ తరగతి విద్యార్థులకు ఈ నెల 11వ తేదీ నుంచి 13వ తేదీ వరకు పరీక్ష నిర్వహిస్తారు. 11వ తేదీన ఉదయం 9.30 నుంచి 10.45 వరకూ తెలుగు/ ఉర్దూ పరీక్షలు నిర్వహించనున్నారు. ఆదే రోజు మధ్యాహ్నం 1.15 గంటల నుంచి 2.30 గంటల వరకు మ్యాథ్‌మాటిక్స్, 12న ఉదయం ఆంగ్లం, మధ్యాహ్నం ఎన్విరాల్‌మెంట్ సైన్సు పరీక్ష ఉంటాయి. 13న ఉదయం ఓఓస్‌ఎస్‌సీ పరీక్ష 3, 4, 5వ తరగతుల విద్యార్థులకు మాత్రమే ఉంటుంది.
6,7,8 తరగతులకు సంబంధించి...
ప్రాథమికోన్నత పాఠశాలల్లో 6, 7, 8వ తరగతుల విద్యార్థులకు 11న ఉదయం 9.30 గంటల నుంచి 10.45 వరకు తెలుగు/ఉర్దూ/కాంజోజిట్ తెలుగు పరీక్ష, మధ్యాహ్నం 1.15 నుంచి 2.30 గంటలకు మ్యాథమాటిక్స్ పరీక్ష ఉంటాయి. 12న హిందీ/స్పెషల్ తెలుగు పరీక్ష, మధ్యాహ్నం జనరల్ సైన్సు/ఫిజికల్ సైన్సు పరీక్ష, 13న ఉదయం ఆంగ్లం, మధ్యాహ్నం సోసియల్ స్టడీస్ పరీక్ష, 14న 6,7వ తరగతులకు ఏఎస్‌ఎస్‌సీ పరీక్ష నిర్వహించనున్నారు.
9,10 తరగతులకు సంబంధించి...
హైస్కూల్స్‌లో 9, 10వ తరగతులకు 11న ఉదయం 11 గంటల నుంచి 12.15 వరకు తెలుగు/ఉర్దూ/కాంపోజిట్ తెలుగు పరీక్ష, మధ్యాహ్నం 2.45 గంటల నుంచి 4 గంటల వరకు మ్యాథ్స్ పరీక్ష నిర్వహించనున్నారు. 12న ఉదయం హింది/ స్పెషల్ తెలుగు, మధ్యాహ్నం ఫిజికల్ సైన్సు, 13న ఉదయం ఆంగ్లం, మధ్యాహ్నం సోసియల్ స్టడీస్ పరీక్ష ఉంటాయి. 13న ఉదయం 9.30 నుంచి 10.45 వరకు 8, 9, 10వ తరగతులకు బయోలాజికల్ సైన్సు, ఉదయం 11 గంటల నుంచి 12.45 వరకు ఓఎస్‌ఎస్‌సీ –1, మధ్యాహ్నం 2,45 నుంచి 4 గంటల వరకు ఓఎస్‌ఎస్‌సి–2 పరీక్ష నిర్వహించనున్నారు.
బైలింగ్విల్‌లో ప్రశ్నాపత్రం...
సిబిఏ విధానంలో నిర్వహిస్తున్న పరీక్షలకు పశ్నాపత్రం బైలింగ్విల్ ఽవిధానంలో ఉంటుంది. విద్యార్థికి ఆంగ్లం అర్థకాకుంటే తెలుగులో చదవి అర్థం చేసుకునే విధానం 2023–24 నుంచి ప్రవేశపెట్టారు. ప్రశ్నపత్రంలో పది ప్రశ్నలు అబ్జెక్టివ్ విధానంలో, మరో ఐదు ప్రశ్నలు రాత పూర్వక విధానంలో ఇవ్వనున్నారు. మొత్తం 15 ప్రశ్నలకు 20 మార్కులు కేటాయిస్తారు. ఓఎంఆర్ పత్రాల్లో జవాబు నింపి జిల్లాకు పంపాల్సి ఉంటుంది. సీబీటీ విధానంలో పరీక్షలు రాసే విద్యార్థులు ప్రశ్నలకు సమాధానాలను ఓఎంఆర్ షీట్లో నింపాల్సి ఉంటుంది.
ఎమ్మార్సీ కేంద్రాలకు...ప్రశ్న పత్రాలు
సెల్ప్ అసెస్‌మెంట్ మోడల్ పేపర్ –1 పరీక్షలకు సంబంధించిన పశ్న పత్రాలు, ఓఎంఆర్ షీట్లను జిల్లా కేంద్రం నుంచి మండల కేంద్రాలలోని ఎమ్మార్సీలకు తరలించాం. పరీక్ష పత్రాలకు ఎంఈఓలు కష్టోడియన్లుగా వ్యవహరిస్తారు. పరీక్ష నిర్వహణకు అవసరమైన అన్ని మార్గదర్శకాలు ఎంఈఓలు, హెచ్‌ఎంలకు జారీ చేశాం.
– విజయభాస్కర్‌రెడ్డి, సెక్రటరీ, డీసీఈబీ, కడప
పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి
ఎస్‌ఏఎంపీ–1 పరీక్షలను ప్రధానోపాధ్యాయుడు పకడ్బందీగా నిర్వహించాలి. ఏ రోజు పరీక్షకు ఆ రోజే ప్రశ్న పత్రాన్ని తీసుకెళ్లి పరీక్ష నిర్వహించాలి. పరీక్షల నిర్వహణలో ఎక్కడా ఆరోపణలకు తావులేకుండా హెచ్‌ఎంలు అన్ని జాగ్రత్తలు తీసుకుని నిర్వహించాలి. పరీక్ష పేపర్లు లీకై తే సంబధితులపై కఠిన చర్యలు తీసుకుంటాం.
– షేక్ షంషుద్ధీన్, జిల్లా విద్యాశాఖ అధికారి

సెల్ఫ్ అసెస్‌మెంట్ పరీక్షలకు వేళాయె..!