
ఎన్నికల నేపథ్యంలో చెక్‌పోస్టుల ఏర్పాటు
పులివెందుల : పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికకు సంబంధించి 11 మంది ప్రధాన పార్టీ అభ్యర్థులతోపాటు ఇండిపెండెంట్లు పోటీలో ఉన్నారని పులివెందుల డీఎస్పీ మురళీనాయక్ తెలిపారు. ఎన్నిక సందర్భంగా కట్టుదిట్టమైన ఏర్పాట్లపై చర్చించి అంతర్ జిల్లాల సరిహద్దులలో చెక్ పోస్టులను ఏర్పాటుచేశామన్నారు. పార్టీ నాయకులు ప్రచారానికి ముందస్తుగా సమాచారం ఇస్తే భద్రత కల్పించామన్నారు. పోలీసులకు సమాచారం ఇవ్వకుండా నల్లగొండువారిపల్లెకు వెళ్లి అక్కడ ప్రచారంలో టీడీపీకి చెందిన గూటూరు ధనుంజయపై వేల్పుల రామలింగారెడ్డి, హేమాద్రిరెడ్డి, మరింతమంది కులం పేరుతో దూషించి మారణాయుధాలతో దాడి చేశారన్నారు. పరస్పర దాడులు జరుపుకోవడంతో మారెడ్డి జయవర్థన్‌రెడ్డి, చప్పిడి శ్రీనాథరెడ్డి, కిరికిరీ బాషా, అక్కులగారి విజయ్‌కుమార్‌రెడ్డి, పేర్ల కళ్యాణ్‌రెడ్డి, పేర్ల సత్యనారాయణరెడ్డి, పేర్ల శేషారెడ్డి, ధనుంజయరెడ్డిలతోపాటు కొంతమంది కంప్లయింట్ ఇచ్చారని, హత్యాయత్నం కింద కేసు నమోదు చేయడం జరిగిందన్నారు. ధనుంజయ తనను కులం పేరు దూషించినట్లు కంప్లయింట్ ఇవ్వడంతో కేసు నమోదు చేశామని తెలిపారు. వైఎస్సార్‌సీపీ నాయకులు పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఎన్నికల నియమావళి, నిబంధనలకు విరుద్ధంగా అనుమతి తీసుకోకుండా పోలీసుల రాకపోకలకు అంతరాయం కలిగించడంపై ఎంపీడీఓ ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేయడం జరిగిందన్నారు. ఎంపీ వైఎస్.అవినాష్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ సతీష్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన్ వరప్రసాద్, మాజీ మార్కెట్ యార్డు చైర్మన్ చిన్నప్ప, బయపురెడ్డి, ఎంపీ పీఏ రాఘవరెడ్డిలతోపాటు 150మందిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ కేసులతోపాటు కోరా విశ్వనాథరెడ్డి ఫోన్లలో నీ అంతు చూస్తామని బెదిరించినట్లు ఫిర్యాదు రావడంతో వైఎస్.భాస్కర్‌రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి, ఎంపీ పీఏ రాఘవరెడ్డి, తుమ్మల గంగాధరెడ్డిలపై కేసు నమోదు చేయడం జరిగిందన్నారు. త్వరగా ఇన్వెస్టిగేషన్ చేసిన బాధ్యులైన వారిని అరెస్టు చేయడం జరుగుతుందన్నారు.
పులివెందుల డీఎస్పీ
మురళీ నాయక్