భక్తిభావంపై రాజకీయ కుట్ర | - | Sakshi
Sakshi News home page

భక్తిభావంపై రాజకీయ కుట్ర

Aug 7 2025 7:46 AM | Updated on Aug 7 2025 8:14 AM

భక్తిభావంపై రాజకీయ కుట్ర

భక్తిభావంపై రాజకీయ కుట్ర

సాక్షి టాస్క్‌ఫోర్స్‌ : కూటమి నేతల కక్ష పూరిత రాజకీయాలకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. తమ రాజకీయ ప్రాబల్యం నిరూపించుకునేందుకు చివరికి భక్తుల మనోభావాలను దెబ్బతీసేందుకు వెనుకాడటంలేదు. ఈ కోవలోనే బద్వేల్‌కు సమీపంలో సగిలేరు ఒడ్డున ఓ వైఎస్సార్‌సీపీ నేత ఏర్పాటుచేసిన స్నానాల ఘాట్‌ను తొలగించేందుకు కుట్ర పన్నారు. ఈ సమయంలో భక్తులు అడ్డుపడటంతో వెనుదిరిగారు. మంగళవారం రాత్రి సమయంలో చోటు చేసుకున్న ఈ చర్య రెవెన్యూ అధికారులు చేసిందా లేక అధికార పార్టీ నాయకులు చేసిందా? అనేది అంతుపట్టడం లేదు.

ఘాట్‌ తొలగించేందుకు యత్నం

మండలంలోని కొంగలవీడు సమీపంలో సగిలేరు ఒడ్డున వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నాయకులు వంకెలపోలిరెడ్డి సుమారు రూ.12 లక్షల సొంత నిధులతో స్నానాల ఘాట్‌ ఏర్పాటు చేయించారు. ఈ ఘాట్‌ను గతేడాది నవంబర్‌ 11న ఎమ్మెల్సీ డీసీగోవిందరెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్‌ సుధల చేతులమీదుగా ప్రారంభించారు. బద్వేల్‌ పరిసర ప్రాంతాల్లో మొట్టమొదటి సారిగా నదీ పరివాహక ప్రాంతంలో ఘాట్‌ ఏర్పాటు చేయడంతో గతేడాది శివునికి ప్రీతిపాత్రమైన కార్తీకమాసంలో వందలాది మంది భక్తులు, అయ్యప్ప దీక్షాపరులు, మహిళలు నదీస్నానాలు చేరశారు. దీపాలు నదిలో వదిలి భక్తిభావంతో పరవశించిపోయారు. దీంతో ఘాట్‌ ఏర్పాటు చేయించిన వైఎస్సార్‌సీపీ నేత పోలిరెడ్డికి చుట్టు పక్కల ప్రాంతాల్లో మంచి పేరు లభించింది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే నియోజకవర్గంలో ఎన్నడూ లేని విధంగా వైఎస్సార్‌సీపీ నేతలపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోంది. టీడీపీ నేతలు పోలిరెడ్డిని టార్గెట్‌ చేశారు. సిద్దవటం రోడ్డులో తన కుటుంబసభ్యులు నిర్మించుకున్న ఇళ్లకు అనుమతులు లేవంటూ నోటీసులు ఇచ్చి సీజ్‌ చేశారళ్లీ ఘటన మరువకముందే భక్తుల సౌకర్యార్థం నిర్మించిన స్నానాల ఘాట్‌ను తొలగించాలని రెవెన్యూ అధికారులపై ఒత్తిడి తీసుకువచ్చారు. ఈ వ్యవహారం జేసీ కోర్టులో నడుస్తోంది. అవేమీ పట్టించుకోకుండా రాత్రి సమయంలో జేసీబీతో వచ్చి స్నానాలఘాట్‌ వద్ద ఏర్పాటుచేసిన గదిని తొలగించేందుకు యత్నించారు. చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన వారు గమనించి ఘాట్‌ను తొలగించకుండా అడ్డుకున్నారు. దీంతో చేసేది లేక తొలగించేందుకు వచ్చిన వారు వెనుదిరిగారు.

స్నానాల ఘాట్‌ తొలగించేందుకు యత్నం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement