
వైఎస్సార్‌సీపీ నేతలపై కక్ష సాధింపు
వల్లూరు: వైఎస్సార్‌సీపీ పోరాటాలతో సీఎం చంద్రబాబు వెన్నులో వణుకు పుట్టిందని, అందుకే ఆయన ఆ పార్టీ నేతలపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతూ లేనికేసులు సృష్టించి అణచివేతకు పాల్పడుతున్నారని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు పోచిమరెడ్డి రవీంద్రనాథరెడ్డి అన్నారు. కడప వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో శనివారం ఆయన మాట్లాడారు. లేని మద్యం కేసు సృష్టించి జగన్ చుట్టూ వున్న వారిని అరెస్టు చేసేందుకు ఎల్లో మీడియాతో కలిసి డ్రామాలాడుతున్నారని అన్నారు. ఎంపీ మిథున్‌రెడ్డిని అక్రమ కేసులో ఇరికించడం అందులో భాగమేనని ఉదహరించారు. కేసుకు సంబంధించి ఎక్కడైనా డబ్బు సీజ్ చేయడం, పెట్టుబడులు పెట్టినట్లుగానీ ఆధారాలు లేకున్నా.. నోటి మాటతో కథలు అల్లుతున్నారని విమర్శించారు. ఏడు కేసుల్లో బెయిల్‌పై వున్న చంద్రబాబునాయుడు తనపై కేసులన్నింటినీ నీరు గార్చడానికి ప్రయత్నిస్తూ కక్షసాధింపు రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.
మిథున్ రెడ్డి అరెస్ట్ అప్రజాస్వామికం:రాచమల్లు
ప్రొద్దుటూరు: వైఎస్సార్‌సీపీ రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డి అరెస్ట్ అప్రజాస్వామికమని, కేవలం కక్షసాధింపు చర్యల్లో భాగంగానే ఆయనను అరెస్టు చేశారని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాదరెడ్డి తెలిపారు. మిథున్‌రెడ్డి అక్రమ అరెస్ట్‌పై రాచమల్లు శనివారం రాత్రి హైదరాబాద్ నుంచి వీడియో విడుదల చేశారు. కూటమి ప్రభుత్వం 13 నెలల పాలనలో అక్రమ అరెస్ట్‌లు తప్పా ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. సిట్ అధికారులు లిక్కర్ కేసులో ఇంత వరకు ఒక్క రూపాయిని కూడా సీజ్ చేయలేదన్నారు. సంస్థలో పనిచేసే చిన్న ఉద్యోగులపై ఒత్తిడి తెచ్చి తప్పుడు స్టేట్‌మెంట్లతో ప్రముఖ నేతలను ఇరికించారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబంపై కక్షసాధింపు చర్యలు జరుగుతున్నాయని తెలిపారు. వ్యక్తిగత కక్షతో పెద్దిరెడ్డి కుటుంబాన్ని బాధించేందుకే మిథున్‌రెడ్డిని అరెస్ట్ చేశారన్నారు. ఆధారాలు లేని కేసులు కోర్టులో నిలబడవన్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏ విత్తనం వేస్తోందో భవిష్యత్తులో అదే ఫలం వస్తుందని హెచ్చరించారు.
జిల్లా అధ్యక్షుడు పి.రవీంద్రనాథ్‌రెడ్డి

వైఎస్సార్‌సీపీ నేతలపై కక్ష సాధింపు