
బైకును ఢీకొన్న టిప్పర్
దువ్వూరు : కడప–కర్నూలు జాతీయ రహదారిపై పుల్లారెడ్డిపేట హైవే డాబా వద్ద బైకును టిప్పర్ ఢీ కొన్న సంఘటనలో ఒకరు మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. రాజుపాళెం మండలం వెలవలి గ్రామానికి చెందిన నల్లమ్మగారి బాలనాగయ్య, ఆయన వియ్యంకుడు మద్దూరు హుస్సేనయ్య కలిసి తన మేకపోతును మైదుకూరు సంతలో విక్రయించడానికి బైకుపై వెళుతున్నారు. వారు మండలంలోని పుల్లారెడ్డిపేట హైవే డాబా వద్దకు రాగానే గ్రావెల్ కోసం రాంగ్ రూట్‌లో వెళుతున్న టిప్పర్ బైకును ఢీ కొంది. ఈ ప్రమాదంలో బాలనాగయ్య, హుస్సేనయ్యలు తీవ్రంగా గాయపడ్డారు. వారిని 108 వాహనంలో ప్రొద్దుటూరు ప్రభుత్వాస్పత్రికి తరలించగా చికిత్స పొందుతుతున్న బాలనాగయ్య(43) మృతి చెందాడు. మృతుడికి భార్య, కూతురు ఉన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు దువ్వూరు ఎస్‌ఐ వినోద్ కుమార్ తెలిపారు.