
రికార్డుల కోసమే ప్రభుత్వ కార్యక్రమాలు
కడప కార్పొరేషన్ : కూటమి ప్రభుత్వం గిన్నిస్ బుక్ రికార్డుల కోసమే ప్రభుత్వ కార్యక్రమాలు నిర్వహిస్తోందని, వాటివల్ల ప్రజలకు ఒనగూరే ప్రయోజనం శూన్యమని మాజీ డిప్యూటీ సీఎం అంజద్‌బాషా విమర్శించారు. కడపలో శుక్రవారం తన కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గురుపౌర్ణమి నాడు సత్యసాయి జిల్లా, పుట్టపర్తి నియోజకవర్గంలోని కొత్తచెరువు జిల్లా పరిషత్ పాఠశాలలో సీఎం చంద్రబాబు పేరెంట్స్, టీచర్స్ మీటింగ్ నిర్వహించి పచ్చి అబద్ధాలు చెప్పారన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నాడు–నేడు ద్వారా అభివృద్ధి చేసిన పాఠశాలలో ఈ సమావేశం నిర్వహించే నైతిక అర్హత వారికి లేదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 60వేల పాఠశాలల్లో 2.20కోట్లమంది విద్యార్థులు, తల్లిదండ్రులు ఈ సమావేశాల్లో పాల్గొన్నారని ఘనంగా చెప్పుకుంటున్నారన్నారు.ఇటీవల వైజాగ్‌లో నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమం కూడా గిన్నిస్ బుక్ రికార్డుల్లోకి ఎక్కిందన్నారు. ఈ ప్రభుత్వం ఏం చేసినా రికార్డుల కోసమే తప్ప ప్రజల కోసం కాదన్నారు. జూన్ 12న ‘తల్లికి వందనం’ కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ అమ్మ ఒడి మార్గదర్శకాల ప్రకారమే ఈ పథకాన్ని అమలు చేస్తున్నామని చెప్పిన సీఎం చంద్రబాబు, కొద్ది రోజులకే మాటమార్చి నిన్న సత్యసాయి జిల్లా కొత్త చెరువు పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో లోకేష్ అలోచనల నుంచి ‘తల్లికి వందనం’ పథకం ఆవిర్భవించిందని చెప్పడం హాస్యాస్పదమన్నారు. దివంగత ఎన్‌టీఆర్ పేరు చెబితే రూ.2 కిలో బియ్యం, మద్యపాన నిషేధం వంటి పథకాలు గుర్తుకు వస్తాయని, వైఎస్సార్ పేరు చెబితే ఉచిత విద్యుత్, ఆరోగ్యశ్రీ, 108,104, జలయజ్ఞం, ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాలు,వైఎస్ జగన్ పేరు చెబితే అమ్మ ఒడి, నాడు–నేడు వంటివి గుర్తుకు వస్తాయన్నారు. అయితే చంద్రబాబు పేరు చెబితే గుర్తుకు వచ్చే పథకం ఒక్కటి కూడా లేదన్నారు. కూటమి ప్రభుత్వంలో ప్రభుత్వ పాఠశాలల్లో 4.50లక్షల అడ్మిషన్లు తగ్గాయన్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో యూనిఫారం, స్కూల్ బ్యాగ్, పుస్తకాలు, షూ, టై, బెల్ట్ వంటివి కిట్‌గా అందించారని, కూటమి ప్ర భుత్వంలో మంత్రి లోకేష్ అసెంబ్లీలో ప్రదర్శించిన స్కూల్ బ్యాగ్‌లు నెల తిరక్కుండానే చిరిగిపోతున్నా యని వీడియోలు చూపించారు.రేషనలైజేషన్ పే రుతో వేల సంఖ్యలో ప్రభుత్వ పాఠశాలలను మూ యించిన ఘనత బాబుదేనన్నారు.కూటమి ప్రభు త్వం ఇచ్చిన హామీలు అమలు చేసేంత వర కువైఎస్సార్‌సీపీ పోరాటం చేస్తూనే ఉంటుందన్నారు.
వైఎస్ జగన్‌ను అంతం చేసే కుట్ర: రెడ్యం
కూటమి ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని అంతం చేసే కుట్ర జరుగుతోందని ఆర్టీసీ మాజీ జోనల్ చైర్మన్ రెడ్యం వెంకట సుబ్బారెడ్డి ఆరోపించారు. చిత్తూరు జిల్లా బంగారు పాళ్యంలో జరిగిన ఘటనే ఇందుకు నిదర్శనమన్నారు. జెడ్‌ప్లస్ కేటగిరి భద్రత ఉన్న ఆయనకు భద్రత కల్పించకుండా ప్రజలను అడ్డుకునేందుకు వేలమంది పోలీసులను ఉపయోగించారన్నారు. వైఎస్సార్‌సీపీ జిల్లా అధికార ప్రతినిధి పి. జయచంద్రారెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు, కరువు కవల పిల్లలని...జిల్లాలో మహానాడు నిర్వహించినప్పటి నుంచి వర్షాలు లేక రైతులు విలవిల్లాడుతున్నారని విమర్శించారు. వైఎస్సార్‌సీపీ నాయకులు బీహెచ్ ఇలియాస్, దాసరి శివప్రసాద్, షఫీ, డిష్ జిలాన్, అక్బర్, అజ్మతుల్లా, అహ్మద్ పాల్గొన్నారు.
వాటివల్ల ప్రజలకు ఒనగూరే
ప్రయోజనం శూన్యం
మాజీ ఉప ముఖ్యమంత్రి
ఎస్‌బీ అంజద్‌బాషా