
కమనీయం..సౌమ్యనాథుడి కల్యాణం
నందలూరు : సౌమ్యనాథుని బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏడోరోజు శుక్రవారం స్వామివారి కల్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. కల్యాణాన్ని తిలకించేందుకు వచ్చిన భక్తులతో ఆలయం కిటకిటలాడింది. ఆలయ ప్రాంగణంలో వివిధ రకాల పుష్పాలతో కల్యా వేదికను అలంకరించారు. పాంచరాత్ర ఆగమ పండితులు రఘునందన్, పవన్‌కుమార్, మనోజ్‌కుమార్, సునీల్‌కుమార్, సాయిస్వామిలు శ్రీదేవి, భూదేవి సమేత సౌమ్యనాథస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉత్పవమూర్తులను ముస్తాబు చేసి మేళతాళాల మధ్య కల్యాణ వేదికపై కొలువుదీర్చారు.అనంతరం కల్యాణాన్ని కన్నులపండువగా నిర్వహించారు. వేదపండితులు, ఆలయ అర్చకుల ఆధ్వర్యంలో మాంగల్యధారణ, ముత్యాల తలంబ్రాలు క్రతువులను నిర్వహించారు.
భక్తుల హరి నామస్మరణలతో ఆలయం భక్తిపారవశ్యంతో నిండిపోయింది. కల్యాణోత్సవం అనంతరం శ్రీదేవి భూదేవి సమేత సౌమ్యనాథస్వామిని ఆలయం చుట్టూ పల్లకీలో ఊరేగించారు. బ్రహ్మోత్సవాల్లో భా గంగా శుక్రవారం రాత్రి గజవాహనంపై స్వామివారు మాడవీధులలో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు కాయ కర్పూరం సమర్పించి మొక్కులను తీర్చుకున్నారు. శనివారం ఉదయం రథోత్సవం నిర్వహించేందుకు టీటీడీ అధికారులు ఏర్పాట్లు చేశారు.
అన్నదానం : కల్యాణోత్సవానికి వచ్చిన భక్తులకు ప్రముఖ పారిశ్రామికవేత్త, టీడీపీ నాయకుడు సోమలరాజు చంద్రశేఖర్‌రాజు ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.కల్యాణం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా రాజంపేట రూరల్ సీఐ బివి రమణ ఆధ్వర్యంలో ఎస్‌ఐ మల్లికార్జునరెడ్డి పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు. స్వర్ణాంధ్ర సంస్థ అధ్యక్షుడు వేపగుంట శ్యామ్రాజ్ ఆధ్వర్యంలో స్కౌట్ సభ్యులు భక్తులకు సేవలు అందించారు.
మారుమోగిన హరినామస్మరణ

కమనీయం..సౌమ్యనాథుడి కల్యాణం