కడప ఎడ్యుకేషన్ : వివిధ కారణాలతో చదువు అర్ధంతరంగా మానేసిన వారికి ఓపెన్ స్కూల్ మళ్లీ చదువుకొనే చక్కటి అవకాశం కల్పిస్తోందని డీఈఓ షేక్ షంషుద్దీన్, ఓపెన్ స్కూల్ జిల్లా కోర్డినేటర్ సాంబశివారెడ్డి అన్నారు. 2025–26 విద్యా సంవత్సరంలో అడ్మిషన్స్‌కు సంబంధించిన కరపత్రాలను కడప డీఈఓ కార్యాలయంలో డీసీ సాంబశివారెడ్డి, ఏపీసీ నిత్యానందరాజు, ప్రభుత్వ పరీక్షల అిసిస్టెంట్ కమిషనర్ వెంకటేష్‌తో కలిసి శుక్రవారం వారు విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఓపెన్ స్కూల్ అడ్మిషన్స్ ప్రక్రియలో ఎటువంటి సందేహాలున్నా అభ్యాసకులు సంబంధిత మండల విద్యాశాఖాధికారి కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు. ఈ ఏడాది కూడా జిల్లాలోని అధ్యయన కేంద్రాల సమన్వయకర్తలు పూర్తి బాధ్యతతో నిర్ణీత గడువులోపు అడ్మిషన్లు పూర్తి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీసీ నిత్యానందరాజు, శివ, తదితరులు పాల్గొన్నారు.