
కమనీయం.. కల్యాణోత్సవం
రాజంపేట : పద కవితా పితామహుడు తాళ్లపాక అన్నమాచార్యుల జన్మస్థలి తాళ్లపాకలో శుక్రవారం సిద్ధేశ్వరస్వామి, చెన్నకేశవస్వామి కళ్యాణోత్సవాలను వేర్వేరుగా వైభవంగా నిర్వహించారు. అన్నమాచార్య ధాన్య మందిరం ఆవరణలోని కళ్యాణ వేదికపై ముందుగా సిద్ధేశ్వరస్వామి, చెన్నకేశవస్వామి, అమ్మవార్ల ఉత్సవ మూర్తులను అలంకరించి కొలువుదీర్చారు. ఒకే వేదికపై శివ, కేశవుల కళ్యాణం జరుగుతుండడంతో రాజంపేట పరిసర ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. కళ్యాణోత్సవానికి హాజరైన వారికి టీటీడీ అన్నప్రసాదం పంపిణీ చేసింది. సర్పంచి గౌరీ శంకర్, ఉద్దండం సుబ్రహ్మణ్యం, అదృష్టదీపుడు, టీటీడీ అధికారులు, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ బాలాజీ తదితరులు పాల్గొన్నారు.
నేడు రథోత్సవం : బ్రహ్మోత్సవాలలో భాగంగా శనివారం సిద్ధేశ్వరస్వామి, చెన్నకేశవస్వామి రథోత్సవం నిర్వహించనున్నారు.
రోడ్డు ప్రమాదంలో జింక మృతి
రాయచోటి : రామాపురం మండలం పాలనగారిపల్లి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో జింక మృతిచెందింది. శుక్రవారం ఉదయం రాయచోటి నుంచి ద్విచక్ర వాహనంలో కొంద రు కడపకు వెళ్తున్నారు. పాలన్నగారిపల్లి సమీపంలో చెట్లపొందల నుంచి జింక రోడ్డుమీదకు రావడంతో ఢీకొన్నారు. ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న దంపతులు గాయాలపాల య్యారు. గాయపడిన జింక కూడా మృతి చెందినట్లు అటవీబీట్ అధికారి భరణీధర్ తెలిపారు.

కమనీయం.. కల్యాణోత్సవం