
●డీఐజీ అత్యుత్సాహం
డాగ్ స్క్వాడ్‌తో శోధన
గండికోటలో పరిశీలిస్తున్న ఎస్పీ, పోలీస్ అధికారులు
సాక్షి ప్రతినిధి, కడప: గండికోటలో బాలిక హత్య సంఘటన మిస్టరీగా మారింది. క్లూస్ టీమ్ పరిశీలించింది. డాగ్ స్క్వాడ్ పర్యటించింది. టవర్ లోకేషన్ తీశారు. ఫోన్ కాల్స్ టెక్నికల్ విశ్లేషణ చేస్తున్నారు. ఐదు రోజులుగా హత్య కేసు దర్యాప్తు కొనసాగుతోంది. ఇద్దరు ఐపీఎస్ స్థాయి అధికారుల పర్యవేక్షణలో క్షేత్రస్థాయిలో నలుగురు డీఎస్‌పీలు, నలుగురు సీఐలు, 10 మంది ఎస్‌ఐలు దృష్టి పెట్టారు. అవసరమైన మేరకు పోలీసులు ఉన్నారు. అయిన్పటికీ కేసులో ఎలాంటి పురోగతి లేదు. సస్పెన్ష్ కొనసాగుతూనే ఉంది.
రాష్ట్రంలో సంచలనం రేపిన ఘటన
పర్యాటక ప్రాంతమైన గండికోటలో మైనర్ బాలిక హత్య. ఒక్కమారుగా యావత్తు సమాజం ఉల్కిపాటుకు గురైంది. ఇంటర్మీడియెట్ చదువుతున్న బాలిక హత్య రాష్ట్రంలో సంచలనంగా మారింది. స్నేహితుడు లోకేష్‌తోపాటు బైక్‌లో గండికోటకు వెళ్లిన బాలిక.. తిరుగు ప్రయాణంలో లేదు. లోకేష్ ఒక్కరే మోటారు బైక్‌పై వస్తున్న ఫుటేజీ సీసీ కెమెరాలో రికార్డు అయ్యింది. దాంతో ఒక్కమారుగా లోకేష్ హత్య చేశారని అందరూ భావించారు. కాగా సాయంత్రానికి లోకేష్ వ్యవహారం తారుమారైంది. హత్యలో లోకేష్ ప్రమేయం లేదని ప్రకటన వెలువడింది. మరోవైపు అన్ని వ్రేళ్లు బంధువుల వైపు చూపాయి. స్నేహితుడు హత్య చేయలేదంటే.. పరువు హత్య చోటుచేసుకుందా? అనే కోణంలో విశ్లేషణలు, వ్యాఖ్యానం నడించింది. మృతురాలి బంధుగణాన్ని అదుపులోకి తీసుకున్నారు. అటు వైపు కూడా ఆధారాలు లభ్యం కాలేదు. ఆపై మరోమారు దర్యాప్తు మొదటికి వచ్చింది. ఈమారు జిల్లాలోని అధికారులు బృందాలుగా విడిపోయి హత్య కేసు విచారణ చేపట్టుతున్నారు.
తల పట్టుకుంటున్న
పోలీసు అధికారులు
మైనర్ బాలిక హత్య కేసులో దర్యాప్తులో పోలీసు అధికారులు తలమునకలై ఉన్నారు. ఎస్పీ అశోక్‌కుమార్ పర్యవేక్షణలో క్షేత్ర స్థాయిలో.. ఇద్దరు డీఎస్‌పీలు, ఇద్దరు ట్రైనీ డీఎస్‌పీలు, నలుగురు సీఐలు, 10 మంది ఎస్‌ఐలు బృందాలు విడిపోయి పలు రకాలుగా విశ్లేషణ చేస్తున్నారు. సీసీ ఫుటేజీలు ఆధారంగా అనుమానిత వాహనదారులను ప్రశ్నిస్తున్నారు. టవర్ లోకేషన్ ద్వారా ఫోన్‌కాల్స్ విశ్లేషణ చేస్తున్నారు. ఎన్నో జాగ్రతలు తీసుకుంటున్నా వివరాలు బహిర్గతం అవుతుండటం దర్యాప్తునకు ప్రతిబంధకంగా మారుతోంది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో జిల్లా పోలీసు యంత్రాంగం దర్యాప్తును కొనసాగిస్తోంది. సంక్లిష్టత మొత్తానికి ఉన్నతాధికారి తొందరపాటు చర్యలేనని పలువురు దెప్పి పొడుస్తుండటం గమనార్హం.
‘తొందరపడి ఓ కోయిలా ముందే కూసింది’ అన్నట్లుగా మైనర్ బాలిక హత్య కేసులో.. కర్నూలు రేంజ్ డీఐజీ తొందరపాటు చర్య స్పష్టంగా కన్పిస్తోంది. ఇలాంటి ఘటనల్లో ఉన్నతాధికారులు ఆశించిన స్థాయిలో చొరవ చూపడం సహేతుకం. ఎస్పీ ఆశోక్‌కుమార్‌తోపాటు ఘటన స్థలానికి చేరకున్న డీఐజీ కోయ ప్రవీణ్ తొందరగా నిర్ధారణకు వచ్చారు. హత్యలో బాలిక స్నేహితుడు లోకేష్ ప్రమేయం లేదని ప్రకటించారు. అంతటితో ఆగకుండా సాయంత్రం నిందితుల్ని అదుపులోకి తీసుకొని.. ఎస్పీ హత్య వివరాలు తెలియజేస్తారని తెలిపారు. హత్య కేసులో ఎలాంటి పురోగతి లేకుండానే.. డీఐజీ స్థాయి అధికారి అలా ప్రకటించడం వెనుక ఆంతర్యం ఏమిటనేది ప్రశ్నార్థకంగా నిలుస్తోంది. అనుమానితుడిగా భావిస్తున్న లోకేష్‌కు డీఐజీ క్లీన్ చిట్ ఇవ్వడంతో.. ఒక్కమారుగా దృష్టి మళ్లింది. బాలిక సమీప బంధువుల వైపు అందరి దృష్టి మళ్లింది. పోనీ అటువైపు ఆధారాలు ఉన్నాయా? అంటే ఇప్పటికీ ఎలాంటి క్లూస్ లభించలేదు? బంధువులంతా దర్యాప్తు అధికారులకు సహకరించేందుకు సంసిద్ధులుగా ఉన్నారు. ఎప్పుడు ఫోన్ కాల్స్ వచ్చినా వెళ్లేందుకు అందుబాటులో ఉన్నారు.