
రోజాపై వ్యాఖ్యలపై.. ఆగ్రహం
● టీడీపీ ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్‌పై ధ్వజం
● క్షమాపణ చెప్పాలని మహిళలు డిమాండ్
కడప కార్పొరేషన్/బద్వేలు అర్బన్: చిత్తూరు జిల్లా నగరి టీడీపీ ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ మాజీ మంత్రి ఆర్‌కే రోజాపై చేసిన వ్యాఖ్యలపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. సభ్య సమాజం సిగ్గుపడేలా ఆయన రోజాను దుర్భాషలాడటాన్ని వైఎస్సార్‌సీపీ జిల్లా మహిళా విభాగం, ప్రజాప్రతినిధులు తీవ్రంగా ఖండించారు. మహిళలను అవమానించడం, కించపరడం టీడీపీ నేతలకు పరిపాటిగా మారిందని, భాను ప్రకాష్‌పై కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని వారు డిమాండ్ చేశారు.