
వీరభద్రస్వామికి కిలో వెండి వితరణ
రాయచోటి టౌన్: రాయచోటి శ్రీ భద్రకాళీ సమేత శ్రీ వీరభద్రస్వామి వారికి భక్తులు కిలో వెండిని వితరణగా అందజేశారు. శుక్రవారం కర్నాటక రాష్ట్రం గుల్బర్గా జిల్లాకు చెందిన గురుమూర్తయ్య, చతురాచారి మట్‌లతో పాటు వారి కుటుంబ సభ్యులు స్వామి వారికి కిలో వెండిని సమర్పించారని ఆలయ ఈవో డీవీ రమణారెడ్డి తెలిపారు. . దీనికి సంబంధించి ఆలయ అధికారులు రశీదును అందజేశారు. వీరి పేరున అర్చకులు స్వామి వారికి, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు. తీర్థప్రాసాదాలు అందజేశారు.
విరబూసిన బ్రహ్మకమలాలు
రామసముద్రం: రామసముద్రం మండల కేంద్రంలోని బయన్న ఇంటి ఆవరణలో బ్రహ్మకమలం పుష్పాలు గురువారం రాత్రి విరబూశాయి. వారి ఇంటి పెరట్లో ఉన్న బ్రహ్మ కమలం చెట్టుకు సుమారు 15 పుష్పాలు పూశాయి. చుట్టుపక్కల ప్రాంతాలల ప్రజలు వీటిని చూసేందుకు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ప్రతి ఏటా పుష్పాలు పూస్తాయని కుటుంబీకులు తెలిపారు.
అభ్యసనా సామర్థ్యాలు
పెంపొందించాలి
కడప ఎడ్యుకేషన్: ఉపాధ్యాయుల్లో అభ్యసనా సామర్థ్యాలు పెంపొందించేలా సంఘ నాయకులు బాధ్యతలు తీసుకోవాలని డీఈఓ షేక్ షంషుద్దీన్ కోరారు. శుక్రవారం కడప డీఈఓ కార్యాలయ సమావేశం మందిరంలో ఉపాధ్యాయుల్లో అభ్యసనా సామర్థ్యం పెంపొందించే విషయమై ఉపాధ్యాయ సంఘ నాయకులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయుల్లో అభ్యసనా సామర్థ్యాలు మెరుగుపడితే విద్యలో నాణ్యత పెరిగి విద్యార్థుల్లో విద్యాభివృద్ధికి తోడ్పాటు అందిస్తుందన్నారు. ఈ విషయంలో ఉపాధ్యాయ సంఘ నాయకులు తమ వంతుగా ఉపాధ్యాయులకు అవగాహన పెంచాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలు సంఘాల నాయకులు పాల్గొన్నారు.
డెయిరీ స్థలంలో బోర్డుల
ఏర్పాటుపై సర్వే
మదనపల్లె రూరల్: అమూల్ డెయిరీ స్థలంలో ప్రైవేట్ వెంచర్‌కు చెందిన వ్యక్తులు రియల్ ఎస్టేట్‌కు సంబంధించి ప్రచార బోర్డులు ఏర్పాటుచేశారని ‘సాక్షి’ శుక్రవారం ప్రచురితమైన కథనంపై రెవెన్యూ అధికారులు స్పందించారు. తహసీల్దార్ కిషోర్‌కుమార్‌రెడ్డి ఆదేశాలతో ఆర్‌ఐ బాలసుబ్రహ్మణ్యం, సర్వేయర్ సుబ్రహ్మణ్యం తదితరులు సంబంధిత స్థలంలో జాయింట్ సర్వే నిర్వహించారు. రెవెన్యూ రికార్డుల్లో నేషనల్ హైవే ఎంతవరకు ఉందో, అంతవరకు కొలతలు వేసి హద్దులను మార్కింగ్ చేశారు. అడ్వర్‌టైజ్‌మెంట్ బోర్డులు ఆర్‌అండ్‌బీ స్థలంలో ఉన్నట్లు నిర్ధారించారు. బోర్డులు ఏర్పాటు చేసిన వ్యక్తులకు నోటీసులు జారీచేసి, పంచాయతీకి పన్ను కట్టించుకోవాల్సిందిగా కార్యదర్శికి సూచించారు. అయితే..రియల్టర్లు డెయిరీకి, బెంగళూరు ప్రధాన రహదారికి మధ్య తమకు చెందిన 7 సెంట్ల స్థలం ఉందని, అందులోనే బోర్డులు ఏర్పాటు చేసుకున్నామని తెలిపారు.

వీరభద్రస్వామికి కిలో వెండి వితరణ

వీరభద్రస్వామికి కిలో వెండి వితరణ

వీరభద్రస్వామికి కిలో వెండి వితరణ