డ్రాగా ముగిసిన కడప–అనంతపురం మ్యాచ్‌ | - | Sakshi
Sakshi News home page

డ్రాగా ముగిసిన కడప–అనంతపురం మ్యాచ్‌

Jul 11 2025 6:23 AM | Updated on Jul 11 2025 6:23 AM

డ్రాగ

డ్రాగా ముగిసిన కడప–అనంతపురం మ్యాచ్‌

కడప వైఎస్‌ఆర్‌ సర్కిల్‌ : ఏసీఏ అండర్‌–19 మల్టీ డే మ్యాచ్‌లో మూడవ రోజు గురువారం కడప–అనంతపురం జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్‌ డ్రాగా ముగిసింది. వైఎస్‌ఆర్‌ ఏసీఏ క్రికెట్‌ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో 74 పరుగుల ఓవర్‌నైట్‌ స్కోరుతో మ్యాచ్‌ ప్రారంభించిన కడప జట్టు 107 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 455 పరుగులు చేసింది. ఆ జట్టులోని రోహిత్‌ వర్మ 204 బంతుల్లో 133 పరుగులు, ఆర్దిత్‌ రెడ్డి 156 బంతుల్లో 111 పరుగులు చేశారు. అనంతపురం జట్టులోని వరుణ్‌ సాయి నాయుడు 4 వికెట్లు తీశాడు. దీంతో మ్యాచ్‌ డ్రాగా ముగిసింది. దీంతో కడప జట్టు తొలి ఇన్నింగ్స్‌లో అధిక్యం సాధించింది.

కేఓఆర్‌ఎం మైదానంలో..

కేఓఆర్‌ఎం క్రికెట్‌ మైదానంలో జరుగుతున్న మరో మ్యాచ్‌లో కర్నూలు జట్టుపై చిత్తూరు జట్టు 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మూడవ రోజు గురువారం 143 పరుగుల ఓవర్‌ నైట్‌ స్కోరుతో రెండవ ఇన్నింగ్స్‌ ప్రారంభించిన కర్నూలు జట్టు 71.2 ఓవర్లలో 272 పరుగులకు ఆలౌట్‌ అయింది. ఆ జట్టులోని హృదయ్‌ 85 పరుగులు, విఖ్యాత్‌ 85 పరుగులు చేశారు. చిత్తూరు జట్టులోని ఘని చక్కటి లైనప్‌తో బ్యాటింగ్‌ చేసి 5 వికెట్లు తీశాడు. అనంతరం రెండవ ఇన్నింగ్‌ ప్రారంభించిన చిత్తూరు జట్టు 42.2 ఓవర్లలలో 3 వికెట్లు కోల్పోయి 304 పరుగులు చేసింది. ఆ జట్టులోని లోహిత్‌ లక్ష్మీ నారాయణ 113 బంతుల్లో 138 పరుగులు చేశాడు.

డ్రాగా ముగిసిన కడప–అనంతపురం మ్యాచ్‌1
1/2

డ్రాగా ముగిసిన కడప–అనంతపురం మ్యాచ్‌

డ్రాగా ముగిసిన కడప–అనంతపురం మ్యాచ్‌2
2/2

డ్రాగా ముగిసిన కడప–అనంతపురం మ్యాచ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement