
ఊర్లో ఉండాల్సిన బడిని మూసేస్తే పిల్లల చదువులెలా? పిల్లల
కడప ఎడ్యుకేషన్ : జిల్లావ్యాప్తంగా గురువారం నిర్వహించిన మెగా పేరెంట్స్ సమావేశాల్లో అధికారులు.. ప్రజాప్రతినిధులకు చుక్కెదురైంది. బడుల్లో సౌకర్యా ల లేమిపై.. పాఠశాలల తరలింపుపై తల్లిదండ్రుల నుంచి ప్రశ్నల వర్షం కురిసింది. కాగా చాలా చోట్ల సమావేశాలకు తల్లిదండ్రులు గైర్హాజరయ్యారు.
● అట్లూరు మండలం చెన్నుపల్లెలో తల్లిదండ్రులు ప్ల కార్డులతో తమ నిరసన వ్యక్తం చేశారు. తమ పిల్లలకు ఊర్లోనే బడి పెట్టాలని.. కిలోమీటర్ల దూరంగా ఉన్న బడికి పంపేది లేదని స్పష్టం చేశారు
● కడప మున్సిపల్ హైస్కూల్ మెయిన్‌లో పిల్లల పర్యవేక్షణపై ఉపాధ్యాయులు పట్టించుకోవడం లేదని జేసీ అదితిసింగ్‌కు తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. గతంలో పనిచేసిన హెచ్‌ఎంతోపాటు పీఈటీలను మళ్లీ ఇదే పాఠశాలకు వేయాలని డిమాండ్ చేశారు. ‘తల్లికి వందనం’ డబ్బులు పడలేదని కొంతమంది జేసీకి ఫిర్యాదు చేశారు.
● జిల్లాలోని మైదుకూరు ఎమ్మెల్యే సుధాకర్‌యాదవ్, ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి సమా వేశాలకు గైర్హాజరయ్యారు. కొన్ని పాఠశాలల్లో సమస్యలున్నా అధికార పార్టీ ఎమ్మెల్యేలకు ఫిర్యాదు చేసేందుకు భయపడి ముందుకురానట్లు చర్చ సాగింది.
మెగా పేరెంట్ మీటింగులో ప్రశ్నలు లేవనెత్తిన తల్లిదండ్రులు
పాఠశాలల్లో వసతుల లేమిపై నిలదీత
జిల్లావ్యాప్తంగా అన్ని యాజమాన్యాల్లో పేరెంట్ సమావేశాలు
పలుచోట్ల ఎమ్మెల్యేలు డుమ్మా

ఊర్లో ఉండాల్సిన బడిని మూసేస్తే పిల్లల చదువులెలా? పిల్లల