
విద్యార్థుల భవిష్యత్తుకు పునాదులు తల్లిదండ్రులే : జేసీ
విద్యార్థుల భవిష్యత్తుకు తల్లిదండ్రులే పునాదులని.. తమ పిల్లల చదువులపై ఉపాధ్యాయులను ప్రశ్నించే తత్వాన్ని అలవరుచుకోవాలని జాయింట్ కలెక్టర్ అదితిసింగ్, కడప నగరపాలక కమిషనర్ మనోజ్‌రెడ్డి సూచించారు. మెగా పేరెంట్ మీటింగ్ సమావేశాల్లో భాగంగా కడప నగరపాలక మొయిన్ స్కూల్లో నిర్వహించిన సమావేశానికి వారు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థుల చదువులు, భద్రతపై పాఠశాల ఉపాధ్యాయులతోపాటు తల్లిదండ్రుల బాధ్యత కూడా ఉండాలన్నారు. విద్యార్థులకు విలువలతో కూడిన విద్యను అందించడంలో ఉపాధ్యాయులు శ్రద్ద తీసుకోవాలన్నారు. మున్సిపల్ హైస్కూల్లో గతంలోనే అధునాతన వసతులను కల్పించామన్నారు. అనంతరం పాఠశాలల్లో చదివి ఉన్నత స్థాయి లో ఉన్న పలువురు పూర్వ విద్యార్థుల అనుభవాలను పిల్లలతో పంచుకున్నారు. ముందుగా పాఠశాలకు వచ్చిన జేసీ తరగతి గదులు, మెడల్ సెంట్రల్ కిచెన్‌ను పరిశీలించారు. పాఠశాలలోని సమస్యలపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థులు వారి తల్లుల పేరుతో మొక్కలు నాటా రు. ఆర్డీవో జాన్ ఇర్వీన్, కార్పొరేటర్ సూర్యనారాయణ, ఎంఈఓలు గంగిరెడ్డి, ఇర్షాద్, కార్పొరేషన్ స్కూల్స్ సూపర్‌వైజర్ ఫరూక్, హెచ్‌ఎం ముబీనా రెహ్మాన్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.