
ఇంటికి రూ.9,150 విద్యుత్ బిల్లు
ప్రొద్దుటూరు : ప్రొద్దుటూరులోని సుబ్బిరెడ్డి కొట్టాలులో 7/135 నంబర్ గల ఇంటికి జూలై నెలకు సంబంధించి ఒకే మారు రూ.9,150 బిల్లు రావడంతో ఇంటి యజమాని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జూన్ నెలకు సంబంధించి 60 యూనిట్లకు రూ.502 బిల్లు వచ్చింది. జూలై నెలకు సంబంధించి ప్రీవియస్ విద్యుత్ రీడింగ్ 536 యూనిట్లుగా, ప్రజంట్ రీడింగ్ 1582 యూనిట్లుగా నమోదు చేశారు. ఈ ప్రకారం రూ.9,150 బిల్లు చెల్లించాలని సిబ్బంది చెప్పడంతో ఇంటి యజమాని లబోదిబోమంటున్నాడు. ఇదేమిటి బిల్లు ఇలా వచ్చిందని ఇంటి యజమాని ప్రశ్నించగా, అవన్నీ మాకు తెలియదు.. వచ్చిన బిల్లు ప్రకారం మీరు డబ్బు చెల్లించాల్సిందేనని సిబ్బంది సమాధానం ఇచ్చారు. ఈ విషయం చర్చనీయాంశంగా మారింది.

ఇంటికి రూ.9,150 విద్యుత్ బిల్లు