
రాజన్నను మరవలేను
నా పేరు ఆదెమ్మ, మాది నీరుగట్టువారిపల్లె. చేనేత కార్మికురాలు. నాకు నలుగురు బిడ్డలు. చీరలు నేస్తేనే ఇళ్లు గడుస్తుంది. పిల్లలను ఉన్నత స్థాయికి తీసుకురావాలన్నదే తపన. మహానేత రాజన్న పుణ్య మాని నా పెద్ద కుమార్తె ఇడుపులపాయలో ట్రిపుల్ ఐటి సీటు వచ్చింది. బీటెక్ పూర్తి చేసి బెంగుళూరులో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పని చేస్తుంది. రెండవ కుమారుడు హేమంత్‌కుమార్ బీటెక్ పూర్తి చేసి చైన్నెలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా ఉద్యోగం చేస్తున్నాడు. మూడవ కుమార్తె మంజుల బీటెక్ పూర్తి చేసి సాప్ట్‌వేర్ ఇంజనీర్‌గా పని చేస్తోంది. నాల్గోవాడు బెంగుళూరులో ఉద్యోగం చేస్తున్నాడు. వైఎస్సార్ పథకాల వల్లే మా పిల్లలు ఉన్నత స్థితిలో ఉన్నారు. ఆయన రుణం మరవలేను.