
బాబు మోసాలను ఎండగడదాం
కడప సెవెన్‌రోడ్స్: ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కులమతాలు, రాజకీయాలు, వర్గాలకు అతీతంగా పాలన అందించారని, 2.0లో మాత్రం చంద్రబాబునాయుడుకు సినిమా చూపిస్తామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పి.రవీంద్రనాథరెడ్డి అన్నారు. మాజీ డిప్యూటీ సీఎం ఎస్‌బీ అంజద్‌బాషా అధ్యక్షతన ఆదివారం నగరంలో నిర్వహించిన ఆ పార్టీ కడప నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. చంద్రబాబు ఒక బుక్ చూపిస్తుంటే వైఎస్సార్ సీపీ ప్రతి కార్యకర్త ఒక్కో బుక్ చూపిస్తారంటూ హెచ్చరించారు. 2027 ఫిబ్రవరి లేదా మార్చిలో జమిలి ఎన్నికలు వచ్చే అవకాశం ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై వ్యతిరేకతతో గెలువడం మనకు వద్దని, పార్టీ సంస్థాగతంగా మరింత బలం పుంజుకుని గెలవాల్సిన అవసరం ఉందన్నా రు. కేసులకు ఎవరూ భయపడవద్దని, కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని స్థానాలు గెలుచుకోవడానికి కార్యకర్తలు కష్టించి పనిచేయాలని కోరారు. హామీలు అమలు చేయకుండా ముఖ్యమంత్రి చేస్తున్న మోసాలపై తొలుత కార్యకర్తలు అవగాహన పెంచుకుని ప్రజలకు వివరించాలన్నారు. బాబు మెడలు వంచైనా సూపర్ సిక్స్ అమలు చేయించాలన్నారు.
కార్యకర్తల నిరుత్సాహం వల్లే ఓటమి
వైఎస్సార్ సీపీ కార్యకర్తల్లో నిరుత్సాహం వల్లే సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి చెందాల్సి వచ్చిందని నగర మేయర్ కె.సురేష్‌బాబు విశ్లేషించారు. బూత్ లెవెల్ కమిటీలు బాగా పనిచేసి ఉంటే అంజద్‌బాషా గెలుపొందేవారని తెలిపారు. కార్యకర్తలకు అండగా నిలుస్తామని, రానున్న మున్సిపల్ ఎన్నికల్లో ఒక్క డివిజన్ కూడా టీడీపీ గెలుచుకోలేదని ధీమా వ్యక్తం చేశారు. పీ4 పేరుతో ప్రజలను మభ్య పెట్టేందుకు బాబు యత్నిస్తున్నారని, పీ4 ఆయనతోనే ప్రారంభించాలన్నారు. వైఎస్సార్ సీపీ సోషల్ మీడియా కార్యకర్తలపై కేసులు నమోదు చేస్తున్నారని పేర్కొన్నారు. పటాకులు పేల్చిన సంఘటనలో మాజీ ఎమ్మెల్యేలు శ్రీకాంత్‌రెడ్డి, రమేష్‌రెడ్డిలపై నక్సలైట్లు, తీవ్ర వాదులపై నమోదు చేసే ఆయుధాల కేసు బనాయించడం అక్రమమని దుయ్యబట్టారు. ప్రశ్నించే గొంతులను నొక్కడం అప్రజాస్వామికమన్నారు.
● కడప పార్లమెంటు నియోజకవర్గ పరిశీలకులు కొండూరు అజయ్‌రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం సంక్షేమ పథకాల ద్వారా ఇప్పటివరకు ప్రజలకు ఎంతమొత్తం అందజేసింది? ఇంకా ఎంత రావాల్సి ఉందనే విషయాలను కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి వివరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ బండి నిత్యానందరెడ్డి, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు దేవిరెడ్డి ఆదిత్య, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు టీపీ వెంకట సుబ్బమ్మ, నగర అధ్యక్షురాలు సీహెచ్ దీప్తిరెడ్డి, ఎస్సీ సెల్ నగర అధ్యక్షులు కంచుపాటి బాబు, మైనార్టీ సెల్ నగర అధ్యక్షుడు షఫీ, యువజన విభాగం నగర అధ్యక్షుడు నాగేంద్ర, విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు సాయిదత్త, డాక్టర్ల విభాగం జిల్లా అధ్యక్షుడు నాగార్జునరెడ్డి, పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పాకా సురేష్, జోనల్ అధ్యక్షుడు ఇలియాస్, జిల్లా ఉపాధ్యక్షుడు దాసరి శివ ప్రసంగించారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ జిల్లా అధికార ప్రతినిధి పి. జయచంద్రారెడ్డి, పులి సునీల్ కుమార్, బంగారు నాగయ్య యాదవ్, జమాల్‌వలీ, పి. రామ్మోహన్‌రెడ్డి, డా. సొహైల్, శ్రీరంజన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
అన్ని డివిజన్లలో గెలుపు మనదే: అంజద్‌బాషా
రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కడప నగర పాలక సంస్థ పరిధిలోని 50 డివిజన్లలోనూ వైఎస్సార్‌సీపీదే గెలుపని మాజీ డిప్యూటీ సీఎం ఎస్‌బీ అంజద్‌బాషా ధీమా వ్యక్తం చేశారు. అన్ని డివిజన్లు టీడీపీకి ఏకగ్రీవం అవుతాయంటూ ఎమ్మెల్యే మాధవిరెడ్డి అంటున్నారని,కనీసం ఒక్క డివిజన్‌లో అయినా ఏకగ్రీవం చేసుకోవాలంటూ సవాల్ విసిరారు. వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు నమోదు చేయడం తప్ప ఏడాది కాలంలో సీఎం చంద్రబాబు ఏ ఒక్క హామీ నెరవేర్చలేదన్నారు. ఎలాంటి షరతులు లేకుండా తల్లికి వందనం కింద ఒక కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి సాయం అందిస్తామని చెప్పి ఇప్పుడు షరతులు విధించారన్నారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో 66 లక్షల మందికి పెన్షన్లు ఇస్తుండగా, బాబు వచ్చాక అందులో ఐదు లక్షలు తొలగించారన్నారు. ఏటా మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తామని చెప్పి ఒక్క దానితో సరిపెట్టడం మోసం కాదా? అని ప్రశ్నించారు.
క్యూఆర్ కోడ్ విడుదల చేస్తున్న వైఎస్సార్ సీపీ నాయకులు సమావేశంలో పాల్గొన్న పార్టీ నేతలు, కార్యకర్తలు
వైఎస్ జగన్ 2.0లో బాబుకు సినిమా
కేసులకు భయపడవద్దు...అండగా ఉంటాం
వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడుపి.రవీంద్రనాథ్‌రెడ్డి

బాబు మోసాలను ఎండగడదాం