ఉత్సాహంగా ఏసీఏ అండర్‌–19 మల్టీడే మ్యాచ్‌లు | - | Sakshi
Sakshi News home page

ఉత్సాహంగా ఏసీఏ అండర్‌–19 మల్టీడే మ్యాచ్‌లు

Jul 6 2025 6:58 AM | Updated on Jul 6 2025 6:58 AM

ఉత్సా

ఉత్సాహంగా ఏసీఏ అండర్‌–19 మల్టీడే మ్యాచ్‌లు

కడప వైఎస్‌ఆర్‌ సర్కిల్‌ : ఏసీఏ అండర్‌–19 మల్టీ డే మ్యాచ్‌లు రెండో రోజు శనివారం ఉత్సాహంగా సాగాయి. కేఓఆర్‌ఎం క్రికెట్‌ మైదానంలో జరుగుతున్న మ్యాచ్‌లో అనంతపురం జట్టు భారీ స్కోరు చేసింది. శనివారం రెండవ రోజు 139 పరుగుల ఓవర్‌ నైట్‌ స్కోరుతో బ్యాటింగ్‌ ప్రారంభించిన అనంతపురం జట్టు 82.2 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 486 పరుగులు చేసి డిక్లేర్‌ చేసింది. ఆ జట్టులోని కేహెచ్‌ వీరారెడ్డి అద్భుతంగా బ్యాటింగ్‌ చేసి 267 బంతుల్లో 30 ఫోర్లు, 12 సిక్సర్లతో 251 పరుగులు చేశాడు. జయంత్‌ కృష్ణ 79 పరుగులు, సందీప్‌ రెడ్డి 55 పరుగులు చేశారు. కర్నూలు జట్టులోని మహిత్‌ తన చక్కటి లైనప్‌తో బౌలింగ్‌ చేసి 5 వికెట్లు తీశాడు. భార్గవ్‌ 2 వికెట్లు తీశాడు. అనంతరం రెండవ ఇన్నింగ్స్‌ ప్రారంభించిన కర్నూలు జట్టు 26 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 115 పరుగులు చేసింది. ఆ జట్టులోని టీవీ సాయి ప్రతాప్‌రెడ్డి 2 వికెట్లు తీశాడు. దీంతో రెండవ రోజు ఆట ముగిసింది.

వైఎస్‌ఆర్‌ఆర్‌ ఏసీఏ స్టేడియంలో..

అదే విధంగా వైఎస్‌ఆర్‌ఆర్‌ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో రెండవ రోజు 14 పరుగుల ఓవర్‌ నైట్‌ స్కోరు తొలి ఇన్నింగ్స్‌తో బ్యాటింగ్‌ ప్రారంభించిన చిత్తూరు జట్టు 69.1 ఓవర్లలో 318 పరుగులు చేసి ఆలౌట్‌ అయింది. ఆ జట్టులోని సిద్దు 74 పరుగులు, వరుణ్‌ 64 పరుగులు, సాయి చరణ్‌ 60 పరుగులు చేశారు. నెల్లూరు జట్టులోని భార్గవ్‌ మహేష్‌ అద్భుతంగా బౌలింగ్‌ చేసి 5 వికెట్లు తీశాడు. అనంతరం రెండవ ఇన్నింగ్స్‌ ప్రారంభించిన నెల్లూరు జట్టు 14 ఓవర్లలో ఒక వికెట్‌ కోల్పోయి 63 పరుగులు చేసింది. దీంతో రెండవ రోజు ఆట ముగిసింది.

251 పరుగులు చేసిన అనంతపురం బ్యాట్స్‌మన్‌ కేహెచ్‌ వీరారెడ్డి

486 పరుగుల భారీ స్కోరు చేసిన అనంతపురం జట్టు

ఉత్సాహంగా ఏసీఏ అండర్‌–19 మల్టీడే మ్యాచ్‌లు 1
1/4

ఉత్సాహంగా ఏసీఏ అండర్‌–19 మల్టీడే మ్యాచ్‌లు

ఉత్సాహంగా ఏసీఏ అండర్‌–19 మల్టీడే మ్యాచ్‌లు 2
2/4

ఉత్సాహంగా ఏసీఏ అండర్‌–19 మల్టీడే మ్యాచ్‌లు

ఉత్సాహంగా ఏసీఏ అండర్‌–19 మల్టీడే మ్యాచ్‌లు 3
3/4

ఉత్సాహంగా ఏసీఏ అండర్‌–19 మల్టీడే మ్యాచ్‌లు

ఉత్సాహంగా ఏసీఏ అండర్‌–19 మల్టీడే మ్యాచ్‌లు 4
4/4

ఉత్సాహంగా ఏసీఏ అండర్‌–19 మల్టీడే మ్యాచ్‌లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement