
శల్యసారధ్యం వహిస్తున్న సర్కార్
వైఎస్సార్ ఏఎఫ్‌యూపై రాష్ట్ర ప్రభుత్వం శల్యసారధ్యం వహిస్తుంది. వెరసి సీఓఏ గుర్తింపు ఇచ్చేందుకు నిరాకరించింది. అప్పటి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సర్కార్ 2023 అక్టోబరులో విశ్వవిద్యాలయాల్లో రెగ్యులర్ అధ్యాపక నియామకాలకు నోటిఫికేషన్ జారీ చేసింది. కాగా, అప్పట్లో టీడీపీ అండ్ కో విశ్వవిద్యాలయ నియామకాలపై కోర్టుకెళ్లి నియామక ప్రక్రియను నిలిపివేసింది. రెగ్యులర్ అధ్యాపకులు లేకపోవడంతో సీఏఓ గుర్తింపు నిచ్చేందుకు నిరాకరించింది. ఈ కారణంగా ఈఏడాది కోర్సు పూర్తి చేసుకోనున్న 63 మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది.
● యూనివర్శిటీకీ గుర్తింపు రాకుంటే వచ్చే ఏడాది 2027లో కోర్సు పూర్తి చేసుకునే విద్యార్థులకు సైతం ఇక్కట్లు తప్పవని పలువురు వివరిస్తున్నారు. కాగా, పాలకులు, అధికారులు స్పందించాల్సిందిపోయి విద్యార్థులకు ఉన్న వసతి గృహాలను సైతం ఖాళీ చేయించడం, మూసి వేయించడం, 2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించి విశ్వవిద్యాలయంలో ప్రవేశాలు సైతం నిర్వహించకపోవడం అను మానాలకు దారి తీస్తోంది. ఈ ఏడాది ఏడీ సెట్ నోటిఫికేషన్ విడుదల చేయలేదు. విశ్వవిద్యాలయంలో ప్రవేశాలు నిలిపివేయడం, విశ్వ విద్యాలయ ప్రాధాన్యత తగ్గించడం, తద్వారా ఇక్కడి నుంచి తరలించడమో, లేదా మూసి వేయడమో చేయాలన్న కుట్ర కోణం దాగి ఉన్నట్లు పలువురు భావిస్తున్నారు.

శల్యసారధ్యం వహిస్తున్న సర్కార్