కొండాపురం: మండల పరిధిలోని తాళ్లప్రొద్దుటూరు గ్రామం అంకాలమ్మ గుడి సమీపంలో తాడిపత్రి– ముద్దనూరు జాతీయ రహదారిలో సోమవారం తెల్లవారుజామున నడుచుకుంటూ వెళుతున్న ముగ్గురిని కారు ఢీకొంది. ఈ ఘటనలో బోయ రాజన్న(64) అక్కడికక్కడే మృతి చెందినట్లు తాళ్లప్రొద్దుటూరు ఎస్‌ఐ హృషికేశ్వర్‌రెడ్డి తెలిపారు. ఎస్‌ఐ వివరాల మేరకు.. తాళ్లప్రొద్దుటూరు గ్రామంలోని అంకాలమ్మ దేవాలయంలో పుట్టువెంట్రుకల కార్యక్రమానికి వచ్చిన వ్యక్తులు రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ప్రొద్దుటూరు మండలం ఖాదరాబాద్ గ్రామానికి చెందిన బోయ రాజన్న మృతి చెందగా ఓబులేసుకు కాలు విరిగిందన్నారు. చంద్రభాస్కర్‌రెడ్డికి తీవ్ర గాయాలు కావడంతో కర్నూలులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. ఈ ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
ఒకరి దుర్మరణం
మరో ఇద్దరికి గాయాలు