
వేసవి వేళ.. చల్లటి జల్లు
కడప ఎడ్యుకేషన్ : జిల్లాలో నెల రోజులుగా ఎండల దెబ్బకు జనం గగ్గోలు పెడుతున్నారు. ఉదయం 9 గంటల నుంచే భానుడు ప్రతాపాన్ని చూపడంతో.. బయటికి రావాలంటేనే జంకాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఒక్కసారిగా వాతావరణంలో మార్పు చోటు చేసుకుంది. దీంతో జిల్లాలోని పలు ప్రాంతాల్లో రెండు, మూడు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాతావరణం చల్లబడి జనం కాసింత ఉపశమనం పొందుతున్నారు. రైతులు వేసవి దుక్కులు చేసుకునేందుకు ఈ వర్షాలు అనుకూలంగా ఉన్నాయి. జిల్లాలో సోమ వారం కూడా వర్షం కురిసింది. అత్యధికంగా దువ్వూ రులో 15.8 మిల్లిమీటర్ల వర్షపాతం నమోదైంది.
మండలం వర్షపాతం
జిల్లాలో కురిసిన వర్షం
దువ్వూరులో అత్యధికంం
ఎండ వేడిమి నుంచి ఉపశమనం
దువ్వూరు 15.8
ప్రొద్దుటూరు 11.4
కొండాపురం 10.4
గోపవరం 10.2
బి.కోడూరు 10.2
బి.మఠం 9.8
అట్లూరు 8.4
బద్వేలు 7.4
రాజుపాళెం 6.8
చెన్నూరు 6.4
ఖాజీపేట 6.4
వేంపల్లి 5.2
కడప 4.8
చాపాడు 4.2
కలసపాడు 4.0
వేముల 3.8
ఎర్రగుంట్ల 3.8
కాశినాయన 2.8
సింహాద్రిపురం 2.6
సిద్దవటం 2.4
మైదుకూరు 2.2
జమ్మలమడుగు 2.0
ఒంటిమిట్ట 1.8
పోరుమామిళ్ల 1.8
సీకే దిన్నె 1.2
పులివెందుల 1.2

వేసవి వేళ.. చల్లటి జల్లు