కడప ఎడ్యుకేషన్ : వైఎస్సార్ కడప జిల్లా క్రీడాకారిణి ఎన్.శ్రీచరణి బీసీసీఐ సీనియర్ ఉమెన్స్ చాలెంజర్స్ ట్రోఫీలో భళా అనిపించారు. డెహ్రాడూన్‌లో నిర్వహిస్తున్న బీసీసీఐ సీనియర్ ఉమెన్స్ చాలెంజర్స్ ట్రోఫీలో యర్రగుంట్ల మండటం యర్రంపల్లె గ్రామానికి చెందిన నల్లపురెడ్డి శ్రీచరణి ఆరు వికెట్లతో ప్రత్యర్థి జట్టును ఇరుకున పెట్టింది. రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో నిర్వహిస్తున్న మల్టీ డేస్ మ్యాచ్‌లో టీం–ఎ, టీం–బి జట్లు తలపడగా, టీం–బీ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న శ్రీచరణి 32 ఓవర్లలో 8 మెయిడిన్ ఓవర్లు వేయడంతోపాటు 6 వికెట్లు తీసి ప్రత్యర్థి జట్టును కట్టడి చేసింది. శ్రీచరణిని ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు రూ.55 లక్షలకు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ వైఎస్‌ఆర్ డిస్ట్రిక్ట్ అధ్యక్షుడు ఎం.భరత్‌రెడ్డి, కార్యదర్శి ఎ. రెడ్డిప్రసాద్, ఉమెన్ క్రికెట్ సమన్వయకర్త కల్యాణదుర్గం విష్ణుమోహనరావు, తదితరులు శ్రీచరణికి అభినందనలు తెలిపారు.