
కవర్ చుట్టు.. లాభాలు పట్టు
కడప అగ్రికల్చర్: మామిడి రైతులు కొత్త పంథా ఎన్నుకున్నారు. మంచి దిగుబడి కోసం వినూత్న ఆలోచనలతో ముందుకు సాగుతున్నారు. వీరికి ఉద్యానశాఖ ప్రోత్సాహకాలు అందిస్తోంది. జిల్లాలో 9642.43 ఎకరాల్లో మామిడపంట సాగులో ఉంది. మామిడి రైతులు సరైన యాజమాన్య చర్యలు చేపట్టినా పంట సమయంలో పురుగులు తెగుళ్లు ఆశించడంతో నాణ్యత తగ్గి దిగుబడులు పడిపోతున్నాయి. కాయ ఎదిగే దశలో పురుగులు తెగుళ్లతో తీవ్రంగా నష్టపోతున్నారు. ఎన్ని మందులు పిచికారీ చేసినా పెట్టుబడి భారీగా పెరిగి రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారు. ఎక్కువసార్లు అధిక డోస్ కలిగిన పురుగుమందులు పిచికారి చేయడం వల్ల పురుగుమందుల అవశేషాలు పండ్లల్లో ఉండి వాటిని తిన్నవారికి క్యాన్సర్ వంటి రోగాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో పురుగుమందుల వాడకం తగ్గించి నాణ్యమైన పంట చేతికి రావడానికి అధిక ఆదాయం పొందడానికి కాయలు ఎదిగే దశలో కవర్లు తొడగాలని ఉద్యాన శాఖ అధికారులు సూచిస్తున్నారు.
కవర్లపై గుర్తులు వేసుకోవాలి...
మామిడికాయలు అన్ని ఒకే దశలో రావు. కాయలకు కవర్లు తొడిగేటప్పుడు మనం తొడిగిన తేదీలు లేదా నెంబర్లు వేసుకుంటే ముందు ఏది తొడిగాం తొడిగిన తర్వాత ఎన్ని రోజులు అయ్యిందో సులభంగా తెలుసుకోవచ్చు. దాని ప్రకారం కాయలు కోసుకోవచ్చు. పేపర్‌తో తయారు చేసిన కవర్లు మాత్రమే ఉపయోగించుకోవాలి. పాలిథిన్ కవర్లు వాడకూడదు. పేపర్ కవర్లు ఉపయోగిస్తే లోపల గాలి బయటకు.. బయట గాలి లోపలకు వెళ్లే అవకాశం ఉంది కాయ నాణ్యంగా ఉంటుంది.
కవర్ల ఏవిధంగా తొడగాలంటే...
కాయకు కవర్ తొడిగేటప్పుడు కవర్ అడుగుకు కాయ తగలకుండా కొంచెం ఖాళీ ఉండేలా చూసుకోవాలి. ఎందుకంటే కాయ పెరుగుతున్నప్పుడు కవర్ పగిలిపోకుండా ఉంటుంది. కవర్లు వర్షం పడుతున్నప్పుడు లేదా మంచు పడే సమయాల్లో తొడగొద్దు. ఎండ ఉన్న రోజు లేదా అలాంటి సమయాల్లో తోడగాలి. కవర్లు తొడిగేటప్పుడు పురుగులు తెగుళ్లు సోకని కాయలను ఎంపిక చేసుకోవాలి. కవర్లు తొడిగిన తర్వాత అమర్చిన వైరుతో కాడకు జాగ్రత్తగా ఎలాంటి ఖాళీ లేకుండా తొడగాలి.
ఆదాయ వివరాలు ఎకరాకు...
ఎకరానికి కవర్లు వాడకుండా నాలుగు టన్నులు దిగిబడి వస్తుంది. ధర టన్నుకు రూ. 25,000 ఉంటుంది. ఇలా రూ. లక్ష ఆదాయం వస్తుంది. కవర్లు తొడిగితే దిగుబడి పెరగడంతోపాటు కాయ నాణ్యత పెరిగి ధర ఎక్కువగా వస్తుంది, దీంతో అదే ఎకరానికి 4.25 టన్నులు దిగుబడి వస్తుంది. టన్నుకు ధర రూ. 50,000 ఉంటుంది. ఇలా ఎకరాకు సాధారణ ఆదాయంతోపాటు 2,12,500 అధిక ఆదాయం వస్తుందని ఉద్యానశాఖ అధికారులు తెలిపారు.
అందుబాటులో సబ్సిడీతో కవర్లు
మామిడి పండ్లకు కవర్ల తొడగడం వల్ల నాణ్యమైన కాయలు వస్తాయి. ఈ కవర్ల ధర సాదారణంగా రూ. 2 అయితే 50 శాతం రాయితీతో ఒక కవర్ రూ.1తో అందిస్తోంది. ఆసక్తి ఉన్న రైతులు ఉద్యాన అధికారులను సంప్రదించవచ్చు. – సుబాషిణి,
జిల్లా ఉద్యానశాఖ అధికారి. వైఎస్సార్‌జిల్లా.
కవర్లు ఎప్పుడు తొడగాలి.. ఎలా తొడగాలి...
కవర్లు ఏ దశలో తొడగాలి అనే అంశం చాలా ము ఖ్యం. మరీ లేత దశ అంటే పిందే దశ లేదా గోలీకా య సైజులో తొడగొద్దు. అలా తొడిగితే కాయ కాడ లేతగా ఉండటం వల్ల కవర్ బరువు తట్టుకోలేక విరిగిపోతుంది. ఒకవేళ మరి ఆలస్యంగా తొడిగితే అప్పటికే అన్ని రకాల పురుగులు తెగుళ్లు ఆశించడంతో ఆశించిన మేర నాణ్యమైన పండ్లను పొందలేం. అందుకే కాయ సుమారు 100 గ్రా ము లు బరువు ఉన్నప్పుడు కవర్లు తొడగాలి. అంటే పూత నుంచి సుమారు 55 నుంచి 60 రోజుల త ర్వాత తొడగాలి. అంటే కోడిగుడ్డు లేదా నిమ్మ కా య సైజులో ఉన్నప్పుడు తొడగాలి. కవర్లు తొడిగిన 65–75 రోజులకు కాయ పక్వానికి వస్తుంది. అప్పు డు కవర్లను తొలగించి కాయలను కోసుకోవాలి.
రూపాయి ఖర్చుతో ఫల రాజసం
మామిడిలో కాయతొలుచు,పండుఈగ పురుగుకు కవర్లతో చెక్
50 శాతం సబ్సిడీతో అందుబాటులో కవర్లు
ప్రతి రైతుకు ఐదెకరాల వరకు అందించనున్న ఉద్యానశాఖ
జిల్లాలో 100 హెక్టార్లకు టార్గెట్ ప్రకటించిన ప్రభుత్వం

కవర్ చుట్టు.. లాభాలు పట్టు

కవర్ చుట్టు.. లాభాలు పట్టు

కవర్ చుట్టు.. లాభాలు పట్టు