
రైలు కిందపడి విశ్రాంత ఉపాధ్యాయుడు మృతి
ముద్దనూరు : మండలంలోని కమ్మవారిపల్లె సమీపంలో రైలు క్రింద పడి భీంచెర్ల శివారెడ్డి(90) శుక్రవారం మృతిచెందాడు. యర్రగుంట్ల రైల్వే ఎస్‌ఐ సునీల్‌కుమార్ రెడ్డి సమాచారం మేరకు మండలంలోని కొర్రపాడు గ్రామానికి చెందిన శివారెడ్డి ఉపాధ్యాయుడిగా పనిచేసి పదవీ విరమణ పొందాడు. శుక్రవారం సాయంత్రం రైలు క్రింద పడి మరణించాడని తెలిపారు. కేసు నమోదు చేసి కారణాలు తెలుసుకునేందుకు దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే ఎస్‌ఐ తెలిపారు.
మిద్దైపె నుంచి పడి గాయాలు
మదనపల్లె : మిద్దైపె నుంచి పడి ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడిన సంఘటన శుక్రవారం ఉదయం పట్టణంలో జరిగింది. నక్కలదిన్నెకు చెందిన వెంకటరమణ(62) మిద్దైపె ఆరబోసిన మిరప కాయలను కిందకు తెచ్చేందుకు వెళ్లాడు. కిందకి దిగే క్రమంలో ప్రమాదవశాత్తూ కాలు జారి కింద పడ్డాడు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడగా, గమనించిన కుటుంబసభ్యులు వెంటనే ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
23న మాలల సింహగర్జన
రాజంపేట రూరల్ : తిరుపతిలో ఈ నెల 23న ఎస్సీ వర్గీకరణ, క్రిమిలేయర్‌ను వ్యతిరేకిస్తూ రాయలసీమ మాలల సింహగర్జన నిర్వహిస్తున్నట్లు రాయలసీమ మాలల జేఏసీ నాయకులు పిలుపునిచ్చారు. స్థానిక ఆర్‌అండ్‌బీ కార్యాలయం వద్ద శుక్రవారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజ్యాంగంలోని ఆర్టికల్ 341కి విరుద్ధంగా ప్రధాని మోదీ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ చేసిందన్నారు. మాలలు అంతా ఏకమై సింహగర్జనలో దీనిని వ్యతిరేకించాలన్నారు. ఈ సమావేశంలో ప్రభాకర్, సంజీవ్, ధన శేఖర్, పూలమరెడ్డి మల్లికార్జున, చిరంజీవి, జనార్ధన, సుబ్బనరసయ్య, సుబ్బయ్య, దండప్రసాద్, కాంతయ్య, కే.హరినాథ్, రవిశంకర్, రైటర్ పుండ్రిక, కె.సుధాకర్, ఒ.పెంచలయ్య, కన్నయ్య, శ్రీను, మనోహర్ పాల్గొన్నారు.