
రావణబ్రహ్మ వాహనంపై అగస్త్యేశ్వరుడు
ప్రొద్దుటూరు కల్చరల్ : స్థానిక అగస్త్యేశ్వరాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఆదివారం వేకువజామున అగస్త్యేశ్వరస్వామికి మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, రాజరాజేశ్వరికి కుంకుమార్చన నిర్వహించారు. స్వామి, అమ్మవారి ఉత్సవ మూర్తులను అలంకరించి రావణబ్రహ్మ వాహనంపై ఆశీనులను చేసి పురవీధుల్లో ఊరేగించారు. శ్రీరామ్‌నగర్‌కు చెందిన పట్టాభిరామ బృందం నిర్వహించిన కోలాటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ కొత్తమిద్దె రఘురామిరెడ్డి, సభ్యులు పాల్గొన్నారు.