ఘాట్‌లో తప్పిన ఘోర ప్రమాదం | Sakshi
Sakshi News home page

ఘాట్‌లో తప్పిన ఘోర ప్రమాదం

Published Mon, May 20 2024 10:30 AM

ఘాట్‌

ముందుంది భారీ మలుపు.. ఉన్నపాటుగా బ్రేక్‌ వేసి అదుపు చేయాలనుకున్న డ్రైవర్‌ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు.. బ్రేక్‌ క్లచ్‌ కిందకు వెళ్లి.. పైకి రాకుండా అలాగే ఉండిపోయింది. దీంతో వాహనం వేగంగా వెళ్తోంది...

డ్రైవర్‌ చాకచక్యంగా ముందున ఓ

బండరాయిని ఢీకొని ముందుకు వెళ్లకుండా ఆపాడు.. దీంతో 25 మంది ప్రాణాలతో

క్షేమంగా బయటపడ్డారు.

బి.కొత్తకోట : బి.కొత్తకోట మండలంలోని పర్యాటక కేంద్రం హార్సిలీ హిల్స్‌ ఘాట్‌ రోడ్డుపై ఆదివారం సాయంత్రం ఘోర ప్రమాదం తప్పింది. డ్రైవర్‌ సమయస్ఫూర్తిగా వ్యవహరించకుండా ఉంటే 25 మంది ప్రాణాలకు ముప్పు ఏర్పడేది. సంఘటన వివరాలు ఇలా..

రాయచోటి నియోజకవర్గం చిన్నమండెంకు చెందిన 25 మంది పర్యాటకులు ఆదివారం ఓ ట్రావెల్స్‌కు చెందిన మినీ బస్సులో హార్సిలీ హిల్స్‌ వచ్చారు. కొండపై ప్రకృతి అందాలను తిలకించి సందడి చేశారు. పచ్చని చెట్ల కింద సేదతీరారు. అనంతరం సాయంత్రం చిన్నమండెంకు తిరుగు ప్రయాణమయ్యారు. డ్రైవర్‌ ఖాదర్‌వలి మినీ బస్సును నెమ్మదిగా కిందకు తీసుకువస్తున్నాడు. కొండ ఘాట్‌ రోడ్డులో ప్రమాదకరమైన ప్రొద్దుటూరు మలుపు సమీపానికి వస్తుండగా వేగం తగ్గించేందుకు బ్రేక్‌పై కాలుపెట్టారు. దీంతో క్లచ్‌ పూర్తిగా కిందకు వెళ్లి మళ్లీ పైకి రాలేదు. బ్రేక్‌ ఫెయిల్‌ అయినట్టు గ్రహించిన ఖాదర్‌వలి మినీ బస్సు నిలిపేందుకు గేర్‌ మార్చి మొదటి గేర్‌కు వేశాడు. ఆగకపోవడంతో హ్యాండ్‌గేర్‌ ఉపయోగించినా ఫలితం లేకపోయింది. ఇంతలో ప్రొద్దుటూరు మలుపు ఎదురుగా కనిపించింది. మలుపు కుడి వైపున మినీబస్సును తిప్పితే పల్లంగా రోడ్డుపై మినీ బస్సు ఆగకుండా వేగంగా ముందుకు వెళ్తుంది. దీంతో ప్రమాదాన్ని నివారించడం కోసం ఖాదర్‌వలి మినీబస్సును మలుపువైపుకు తిప్పకుండా నేరుగా ఇనుప గ్రిల్‌ ఉన్న చోట ఎదురుగా తీసుకెళ్లి ఢీకొట్టించే ప్రయత్నం చేశాడు. దీంతో బస్సు గ్రిల్‌ అంచున దూసుకెళ్లి కొండ బండరాళ్లను ఢీకొట్టి ఆగిపోయింది. దీంతో పెనుప్రమాదం తృటిలో తప్పింది. ఇదే మలుపు వద్ద 60 ఏళ్ల క్రితం పెళ్లి బస్సు ప్రమాదానికి గురై అంతా దుర్మరణం చెందారు. డ్రైవర్‌ చాకచక్యంగా వ్యవహరించకపోతే తీవ్ర ప్రాణ నష్టం జరిగి ఉండేది. బస్సు ప్రమాదానికి గురికావడంతో పర్యాటకులంతా కొండ కిందకు కాలినడకన చేరుకున్నారు. తర్వాత మదనపల్లె నుంచి కొండపైకి వచ్చి తిరిగి వెళ్తున్న బస్సులో ఎక్కిన పర్యాటకులు అంగళ్లు వెళ్లి అక్కడి నుంచి చిన్నమండెం వెళ్లారు.

ప్రొద్దుటూరు మలుపు వద్ద కొండను ఢీకొన్న మినీ బస్సు

బ్రేక్‌ ఫెయిల్‌ అయినా డ్రైవర్‌ చాకచర్యంతో అంతా క్షేమం

ఘాట్‌లో తప్పిన ఘోర ప్రమాదం
1/2

ఘాట్‌లో తప్పిన ఘోర ప్రమాదం

ఘాట్‌లో తప్పిన ఘోర ప్రమాదం
2/2

ఘాట్‌లో తప్పిన ఘోర ప్రమాదం

Advertisement
 
Advertisement
 
Advertisement