గీత కార్మికుడికి గాయాలు | - | Sakshi
Sakshi News home page

గీత కార్మికుడికి గాయాలు

Apr 5 2026 7:24 AM | Updated on Apr 5 2026 7:24 AM

మోత్కూరు : తాటిచెట్టు పైనుంచి జారిపడి గీత కార్మికుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన మోత్కూరు మండలం పాటిమట్ల గ్రామంలో శనివారం సాయంత్రం జరిగింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. పాటిమట్ల గ్రామానికి చెందిన గీత కార్మికుడు రాచకొండ సుధాకర్‌గౌడ్‌ రోజుమాదిరిగానే శనివారం సాయంత్రం గ్రామ పరిధిలో తాటిచెట్టు ఎక్కి కల్లు గీసి దిగుతుండగా.. ప్రమాదవశాత్తు చెట్టు పైనుంచి జారి కిందపడ్డాడు. ఈ ప్రమాదంలో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. సుధాకర్‌గౌడ్‌ను కుటుంబ సభ్యులు మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు.

చికిత్స పొందుతూ మృతి

పెద్దవూర: రోడ్డు పక్కన స్పృహతప్పి పడిపోయిన గుర్తుతెలియని వ్యక్తిని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ శుక్రవారం అర్థరాత్రి మృతిచెందాడు. పెద్దవూర పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దవూర మండలం పులిచర్ల గ్రామంలోని పెట్రోల్‌ బంక్‌ సమీపంలో గురువారం గుర్తుతెలియని వ్యక్తి స్పృహతప్పి పడిపోయి ఉండటాన్ని గ్రామస్తులు గమనించి 108 సిబ్బందికి సమాచారం ఇచ్చారు. 108 సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సదరు వ్యక్తిని నాగార్జునసాగర్‌లోని కమలానెహ్రూ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ శుక్రవారం అర్థరాత్రి మృతిచెందాడు. మృతుడి వయస్సు 42 నుంచి 47 ఏళ్ల మధ్య ఉంటుందని పోలీసులు తెలిపారు. మృతుడు గోధుమ రంగు కాటన్‌ ప్యాంట్‌ ధరించి ఉన్నాడని, అతడి చేతిపై బి. రమణ అని హిందీలో, తెలుగులోనూ పచ్చబొట్టు ఉన్నట్లు పేర్కొన్నాఉ. మృతుడి వివరాలు తెలిసిన 87126 70198, 97001 25494 నంబర్లకు సమాచారం ఇవ్వాలని పోలీసులు సూచించారు. మృతదేహాన్ని నాగార్జునసాగర్‌ ఏరియా ఆస్పత్రి మార్చురీలో భద్రపర్చినట్లు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ వై. ప్రసాద్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement