బైక్‌ను ఢీకొట్టిన కారు.. ఒకరు మృతి | - | Sakshi
Sakshi News home page

బైక్‌ను ఢీకొట్టిన కారు.. ఒకరు మృతి

Apr 5 2026 7:24 AM | Updated on Apr 5 2026 7:24 AM

ఆత్మకూర్‌ (ఎస్‌)(సూర్యాపేట) : బైక్‌ వెళ్తున్న వ్యక్తిని ఎదురుగా వస్తున్న కారు ఢీకొనడంతో మృతిచెందాడు. ఈ ఘటన ఆత్మకూర్‌(ఎస్‌) మండలం నెమ్మికల్‌ గ్రామ శివారులో శనివారం తెల్ల వారుజామున జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆత్మకూర్‌(ఎస్‌) మండలంలోని బోరింగ్‌తండాకు చెందిన భావ్‌సింగ్‌(42) సుతారీ మేస్త్రిగా పనిచేస్తున్నాడు. శనివారం తెల్లవారుజామున ఐదు గంటల సమయంలో పని నిమిత్తం బైక్‌పై బోరింగ్‌తండా నుంచి నెమ్మికల్‌ వైపునకు వస్తుండగా.. సూర్యాపేట నుంచి నూతనకల్‌ వైపు వెళ్తున్న కారు వేరే వాహనాన్ని ఓవర్‌టేక్‌ చేసే క్రమంలో ఎదురుగా వస్తున్న భావ్‌సింగ్‌ బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో భావ్‌సింగ్‌కు తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు అతడిని సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతిచెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. మృతుడి భార్య చిన్ని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ శ్రీకాంత్‌గౌడ్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement