నల్లగొండ టూటౌన్ : నూతన భవనాల నిర్మాణం పేరుతో హాస్టల్‌కు వచ్చే నీటిని మళ్లిస్తున్న కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోవాలని నల్లగొండలోని ఎంజీ యూనివర్సిటీలో విద్యార్థి సంఘాల నాయకులు శనివారం ఆందోళన చేపట్టారు. కాంట్రాక్టర్ సొంతంగా నీటి సదుపాయం ఏర్పాటు చేసుకోవాల్సి ఉన్నప్పటికీ, అధికారుల సహకారంతో విద్యార్థుల అవసరాలకు కేటాయించిన నీటినే భవన నిర్మాణానికి వాడుతున్నారని తెలిపారు. హాస్టల్ విద్యార్థులు నీటికి ఇబ్బందులు పడుతుండగా, కాంట్రాక్టర్‌కు అధికారులు మద్దతుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. రిజిస్ట్రార్ కొప్పుల అంజిరెడ్డి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళనను విరమించారు. ఏబీవీపీ అధ్యక్షుడు హనుమాన్‌చారి, బీఆర్‌ఎస్వీ అధ్యక్షుడు వాడపల్లి నవీన్, ఎంఎస్‌ఎఫ్ అధ్యక్షుడు మాచర్ల సుధీర్ తదితరులు పాల్గొన్నారు.


