కోదాడ : ప్రపంచంలోని వివిధ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు బెంగుళూరు కేంద్రంగా గ్రే కాప్స్, టీచర్ ట్రైబ్ సంస్థలు ఆన్‌లైన్‌లో నిర్వహించిన వరల్డ్ టీచర్స్ క్విజ్–26 విజేతగా కోదాడలోని తేజ విద్యాలయ ఉపాధ్యాయుడు ఉస్తేల ధనుష్‌రెడ్డి నిలిచినట్లు పాఠశాల నిర్వాహకులు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. మార్చి 1 నుంచి 28 వరకు ఆన్‌లైన్‌లో నిర్వహించిన ఈ పోటీల్లో 11 వేల మంది పాల్గొనగా ఫైనల్‌కు నలుగురు ఎంపికయ్యారు. ఐదు రౌండ్లుగా జరిగిన ఫైనల్ పోటీలో ధనుష్‌రెడ్డి 500 మార్కులతో ప్రథమస్థానంలో నిలిచి రూ.20 వేల నగదు గెలుచుకున్నట్లు పేర్కొన్నారు. విజేతను పాఠశాల ప్రిన్సిపాల్ రమాసోమిరెడ్డి, ఉపాధ్యాయులు అభినందించారు.
పోలీసుల విధులకు
ఆటంకం.. ఇద్దరి రిమాండ్
అడవిదేవులపల్లి : మద్యం మత్తులో పోలీసుల విధులకు ఆటంకం కల్గించిన ఇద్దరు వ్యక్తులను అడవిదేవులపల్లి పోలీసులు అరెస్ట్ చేసి మంగళవారం రిమాండ్‌కు తరలించారు. ఎస్‌ఐ శేఖర్ తెలిపిన వివరాల ప్రకారం.. అడవిదేవులపల్లి మండలం బాల్నేపల్లి గ్రామానికి చెందిన యూట్యూబర్ రమావత్ సురేష్ అలియాస్ జయసూర్య, బత్తుల అయ్యప్ప ఆదివారం రాత్రి మద్యం మత్తులో బైక్‌పై వెళ్తుండగా.. అడవిదేవులపల్లి సమీపంలో వాహనాలు తనిఖీ చేస్తున్న పోలీసులు వారిని ఆపారు. ఈ క్రమంలో వారిద్దరు పోలీసులను దర్భాషలాడుతూ విధులకు ఆటంకం కల్గించారు. అంతేకాకుండా పోలీసులపై దాడికి యత్నించారు. దీంతో వారిని అరెస్ట్ చేసి మంగళవారం కోర్టులో హాజరుపర్చి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్‌ఐ పేర్కొన్నారు.


