భువనగిరిలో బీజేపీ జెండా ఎగురవేయాలి
భువనగిరి: వచ్చే మున్సిపాలిటీ ఎన్నికల్లో భువనగిరిలో బీజేపీ జెండా ఎగురవేయాలని భువనగిరి మున్సిపల్ ఎన్నికల ఇన్‌చార్జి వట్టిపల్లి శ్రీనివాస్, పార్టీ జిల్లా అధ్యక్షుడు అశోక్ పేర్కొన్నారు. బుధవారం ఆ పార్టీ జిల్లా కార్యాలయంలో మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. మున్సిపల్ ఎన్నికల్లో ఎక్కువ కౌన్సిలర్ల సీట్లు గెలుపొంది బీజేపీ సత్తా చాటాలన్నారు. బీజేపీ ప్రభుత్వం అమలు చేస్తున్న ఎన్నో సంక్షేమ పథకాలను గడపగడపకూ తీసుకెళ్లి ప్రజలకు వివరించాలన్నారు. సమావేశంలో పార్టీ మాజీ జిల్లా అధ్యక్షుడు పాశం భాస్కర్, సీనియర్ నాయకులు నర్ల నర్సింగ్‌రావు, చందుపట్ల వెంకటేశ్వర్లురావు,సుర్వి శ్రీనివాస్‌గౌడ్, పడమటి జగన్మోహన్‌రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు శ్యాంసుందర్‌రెడ్డి, పట్నం శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శులు చందా మహేందర్ గుప్తా, మున్సిపల్‌మాజీ వైస్ చైర్మన్ మాయ దశరథ, కోళ్ల భిక్షపతి, పట్నం కపిల్, బలరాం, వెంకటేశం, శ్రీశైలం, మహమూద్, కృష్ణచారి, ఉడుత భాస్కర్ పాల్గొన్నారు.


