వీధుల్లో చెత్త.. శివారులో పొగ
ఆరు మున్సిపాలిటీల్లో చెత్త నిర్వహణ అస్తవ్యస్తం
ఫ రెండు రోజులకోసారి చెత్తసేకరణ ఫ ఊసేలేని తడి, పొడి చెత్త రీసైక్లింగ్
ఫ గుట్టలుగా పేరుకుపోతున్న చెత్తాచెదారం ఫ నిప్పు పెడుతున్న సిబ్బంది.. ఇబ్బందుల్లో ప్రజలు
మోత్కూర్ : మోత్కూర్ మున్సిపాలిటీ పరిధిలోని లూర్దునగర్ కాలనీకి సమీపంలో ప్రభుత్వ భూమిలో ఏర్పాటు చేసిన డంపింగ్ యార్డులో గుట్టలు గుట్టలుగా చెత్త పేరుకుపోతోంది. మున్సిపాలిటీ పరిధిలో 12 వార్డులు, సుమారు 20 వేల జనాభా ఉంది. రోజూ రెండు ట్రాక్టర్లు, ఆరు ఆటోల ద్వారా సుమారు 5 నుంచి 6 మెట్రిక్ టన్నుల చెత్తను సేకరించి సమీపంలోని డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు. ప్రధాన వీధుల్లో మాత్రమే నిత్యం చెత్త సేకరిస్తున్నారు. కాలనీలు, గల్లీలు, శివారు గ్రామాలు, విలీన గ్రామాల్లో ఐదారు రోజులకోసారి చెత్త సేకరిస్తున్నారు. చెత్త రీ సైక్లింగ్ యూనిట్ ఏర్పాటుకు రూ.కోటి మంజూరైనా పనులు చేపట్టలేదు. డంపింగ్ యార్డ్ సమీపంలో ఉన్న భూములు చెత్త, ప్లాస్టిక్ వ్యర్థాలతో నిండిపోతున్నాయని రైతు చెరుకు సత్యనారాయణ ఆందోళన వ్యక్తం చేశారు. తర్వలో రీసైక్లింగ్ పనులు చేపట్టనున్నట్లు కమిషన్ సతీష్‌కుమార్‌తెలిపారు.
పెద్దవాగులో చెత్త డంప్
ఆలేరు: ఆలేరు మున్సిపాలిటీ పరిధిలో మొత్తం 12 వార్డులు ఉన్నాయి. 23వేల జనాభా ఉంది. నాలుగు ప్రైవేట్ ఆటోలు, మరో రెండు మున్సిపల్ ఆటోల ద్వారా ఇంటింటికీ తిరిగి చెత్తను సేకరిస్తున్నారు. ప్రైవేట్ ఏజెన్సీ వారు ఇంటికి నెలకు రూ.50 చొప్పున వసూలు చేస్తున్నారు. ఇద్దరు సూపర్‌వైజర్లతో కలిపి మొత్తం 42మంది పారిశుద్ధ్య సిబ్బంది పని చేస్తున్నారు. ఇళ్లు, వ్యాపార వర్గాల నుంచి రోజూ సుమారు 3వేల టన్నుల చెత్త ఉత్పత్తి అవుతుందని అంచనా.ఈ చెత్తను మున్సిపల్ సిబ్బంది పెద్దవాగులో డంప్ చేస్తున్నారు. దీంతో వాగు జలాలు కలుషితం అవుతున్నాయి. చెత్తను దహనం చేయడంతో చుట్టుపక్కల కాలనీల వాసులు పొగతో ఇబ్బంది పడుతున్నారు. డంపింగ్ యార్డు కోసం సాయిగూడెం శివారులో మూడేళ్ల కిత్రమే అధికారులు రెండు ఎకరాల స్థలాన్ని కేటాయించారు. స్థానిక రైతుల నుంచి అభ్యంతరం రావడంతో డంపింగ్ యార్డు ఏర్పాటు ప్రక్రియ పెండింగ్‌లో పడింది. డంపింగ్ యార్డుకు కేటాయించిన స్థలం హద్దులు చూపించాలని ఇటీవల తహసీల్దార్‌కు లేఖ రాసినట్లు మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ తెలిపారు. త్వరలో యార్డు ఏర్పాటు చేస్తామన్నారు.
వీధుల్లో చెత్త.. శివారులో పొగ
వీధుల్లో చెత్త.. శివారులో పొగ


