తుది విడతలోనూ ఓటెత్తారు
సాక్షి, యాదాద్రి : పంచాయతీ మూడవ విడత ఎన్నికల్లోనూ పల్లె ఓటెత్తింది. బుధవారం ఆరు మండలాల్లో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. తొలి, మలి విడత మాదిరిగానే ఆఖరి దశలోనూ రికార్డు స్థాయిలో 92.56 శాతం ఓటింగ్ నమోదైంది. మందకొడిగా మొదలైన పోలింగ్.. 11 గంటల తరువాత పుంజుకుని, చివరి గంటలో గణనీయంగా పెరిగింది. మేజర్ పంచాయతీల్లో పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులుదీరారు.అభ్యర్థులు పోటీపడి ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు రప్పించారు.
అత్యధికంగా చౌటుప్పల్ మండలంలో..
అత్యధికంగా చౌటుప్పల్ మండలంలో 94.26 శాతం పోలింగ్ నమోదు కాగా.. అత్యల్పంగా మోత్కూరు మండలంలో 90.11 శాతం మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. గుండాల మండలంలో 92.83 శాతం, సంస్థాన్‌నారాయణపురంలో 92.44 శాతం, మోటకొండూరు 92.28 శాతం, అడ్డగూడూరు మండలంలో 91.29 శాతం ఓటింగ్ నమోదైంది. ఆరు మండలాల్లో 1,59,289 మంది ఓటర్లు ఉండగా 1,47,432 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇందులో పురుషులు 73,640 మంది, మహిళా ఓటర్లు 73,792 ఉన్నారు.
114 సర్పంచ్‌లు, 998 వార్డులకు ఎన్నికలు
మూడో విడతలో 124 పంచాయతీలు, 1,086 వార్డులకు ఎన్నికల అధికారులు నోటిఫికేషన్ ఇచ్చారు. ఇందులో 10 పంచాయతీలు, 93 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. ఇవి పోను 114 గ్రామ పంచాయతీలు, 998 వార్డులకు బుధవారం ఎన్నికలు జరిగాయి. సర్పంచ్‌లకు 338 మంది, వార్డుసభ్యులుగా 2,395 మంది పోటీపడ్డారు.
ముగిసిన సంగ్రామం
మూడు విడతల్లో జరిగిన పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఎన్నికలు సజావుగా ముగియడంతో యంత్రాంగం ఊపిరిపీల్చుకుంది.
92.56 శాతం పోలింగ్
ఫ 114 పంచాయతీల్లో ఎన్నికలు
ఫ 1,47,432 మంది ఓటు హక్కు వినియోగం
ఫ ప్రశాంతంగా ముగిసిన పల్లెపోరు


