తొలిసారి ఓటు వేసిన అక్కాచెల్లెళ్లు
త్రిపురారం : రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా ఆదివారం త్రిపురారం మండల కేంద్రానికి చెందిన అక్కాచెల్లెళ్లు దార్ల భవానీ, దార్ల మౌనిక, దార్ల మనీషా స్థానిక జెడ్పీహెచ్‌ఎస్‌లోని పోలింగ్ బూత్‌లో మొదటిసారి తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మొదటిసారి ఓటు వేయడం ఆనందంగా ఉందన్నారు. రాజ్యాగం కల్పించిన ఓటు హక్కును ప్రతిఒక్కరూ బాధ్యతతో సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.
మొదటి విడతలో అన్న..
రెండో విడతలో చెల్లెలు
సాక్షి, యాదాద్రి : మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బొమ్మలరామారం మండలం చీకటిమామిడి గ్రామ సర్పంచ్‌గా తిరుమణి నాగరాజుగౌడ్ విజయం సాధించాడు. ఆదివారం జరిగిన రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో భువనగిరి మండలం వడాయిగూడెం గ్రామ సర్పంచ్‌గా నాగరాజుగౌడ్ చెల్లెలు నీల శిరీష గెలుపొందింది. దీంతో వారి కుటుంబ సభ్యులు సంతోషంలో మునిగిపోయారు.
ఒక్క ఓటుతో గెలుపు
చివ్వెంల(సూర్యాపేట) : సూర్యాపేట జిల్లా చివ్వెంల మండల పరిధిలోని గుంపుల గ్రామంలో బీఆర్‌ఎస్ బలపర్చిన అభ్యర్థి నాతాల పద్మ ఒక ఓటు తేడాతో, కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థి కాసాని పద్మపై గెలిపొందారు. గ్రామంలో 954 ఉండగా 902ఓట్లు పోల్ అయ్యాయి. వీటిలో కాసాని పద్మకు 436, నాతాల పద్మకు 437 వచ్చాయి. దీంతో రీకౌంటింగ్ నిర్వహించగా ఎలాంటి తేడా లేకపోవడంతో నాతాల పద్మ గెలిచినట్లు అధికారులు ప్రకటించారు.
మూడు ఓట్లతో గెలిచిన స్వతంత్ర అభ్యర్థి
పెద్దవూర: పెద్దవూర మండలం సంగారం గ్రామ సర్పంచ్‌గా స్వతంత్ర అభ్యర్థి ఈసం రమేష్ గెలుపొందాడు. గతంలో సంగారం పెద్దవూర గ్రామ పంచాయతీలో ఉండేది. ఈ మధ్యనే గ్రామ పంచాయతీగా ఏర్పాటైంది. సర్పంచ్ పదవి ఎస్సీ జనరల్‌కు రిజర్వ్ అయ్యింది. దీంతో గ్రామానికి చెందిన ఐదుగురు ఎన్నికల బరిలో నిలిచారు. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన ఈసం రమేష్ కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థి మాతంగి శ్రీనయ్యపై 3 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందాడు. రమేష్ గ్రామంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుంటాడు. దీంతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో నిలిచినా ప్రజల సర్పంచ్‌గా గెలిపించారు.
తొలిసారి ఓటు వేసిన అక్కాచెల్లెళ్లు
తొలిసారి ఓటు వేసిన అక్కాచెల్లెళ్లు
తొలిసారి ఓటు వేసిన అక్కాచెల్లెళ్లు
తొలిసారి ఓటు వేసిన అక్కాచెల్లెళ్లు


