ఇంటి వద్దకే మసాజ్ బండి
చిట్యాల : ‘ఉపాయం ఉన్నోడు ఉపవాసం పండడు’ అని ఊళ్లల్లో పెద్దలు అంటుంటారు. దానిని నిజం చేస్తూ మునుగోడుకు చెందిన సరికొండ వెంకన్న విన్నూతంగా ఆలోచించి మొబైల్ మసాజ్ వ్యాన్‌లు రూపొందించి తనతో పాటు మరో 30 మందికి ఉపాధి కల్పిస్తున్నాడు. వ్యాన్‌లో జనరేటర్ సహాయంతో నడిచే మసాజ్ కుర్చీని అమర్చి గ్రామాలకు తిరుగుతూ మసాజ్ చేస్తున్నాడు. ఇలా వెంకన్న పదిహేడు వరకు మొబైల్ మసాజ్ వ్యాన్‌లు నిర్వహిస్తూ, వ్యాన్‌కు ఇద్దరి యువకులను నియమించి నెలనెలా వేతనాలు ఇస్తున్నాడు. ఆదివారం చిట్యాలలో ఈ మొబైల్ మసాజ్ వ్యాన్‌లో పలువురు మసాజ్ చేయించుకున్నారు.


