ఓటేసిన శతాధిక వృద్ధురాలు
రీకౌంటింగ్‌లో వరించిన విజయం
భువనగిరిటౌన్ : బీబీనగర్ మండలం రాఘవాపురం గ్రామ సర్పంచ్ ఫలితం రీకౌంటింగ్‌లో తేలింది. కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థిగా సిద్ధగోని శ్రీకాంత్, బీఆర్‌ఎస్ బలపర్చిన అభ్యర్థిగా శంకరయ్య పోటీ చేయగా.. మొదట ఇద్దరికీ సమాన ఓట్లు వచ్చాయి. దీంతో అధికారులు మూడుసార్లు రీకౌంటింగ్ నిర్వహించగా.. రెండు ఓట్ల తేడాతో సిద్ధగోని శ్రీకాంత్‌గౌడ్ సర్పంచ్‌గా గెలుపొందినట్లు అధికారులు ప్రకటించారు.
భువనగిరి : భువనగిరి మండలం అనంతారం గ్రామానికి చెందిన 102 ఏళ్ల వృద్ధురాలు మణెమ్మ ఆదివారం జరిగిన రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో తన ఓటు హక్కు వినియోగించుకుంది. అనంతారం గ్రామంలో పోలింగ్ కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్ హనుమంతరావు మణెమ్మకు పూల మొక్క అందజేసి స్వాగతం పలికారు. అనంతరం శాలువాతో ఆమెను సన్మానించారు.


