సాగర్‌లో సీఎస్, మాజీ డీజీపీ
నాగార్జునసాగర్ : నాగార్జునసాగర్ సమీపంలో ఆంధ్రా ప్రాంతంలోని ఏపీ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాల(ఏపీఆర్‌జేసీ) స్వర్ణోత్సవాలు శని, ఆదివారాల్లో నిర్వహించారు. ఈ కళాశాలలో 1975 నుంచి 2025 వరకు చదివిన విద్యార్థులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. దీంతో సాగర్ పరిసరాల్లో ఆంధ్రా, తెలంగాణ ప్రాంతంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ గెస్ట్‌హౌజ్‌లు అతిథులతో నిండిపోయాయి. తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఆదివారం నాగార్జునసాగర్‌కు చేరుకుని స్వర్ణోత్సవాల్లో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. అనంతరం విజయవిహార్ గెస్ట్‌హౌజ్‌లో కొద్దిసేపు గడిపారు. సాగర్‌కు వచ్చిన వారిలో తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి తుకారాంజి, రిటైర్డ్ డీజీపీ మహేందర్‌రెడ్డి తదితరులు ఉన్నారు. అనంతరం సాగర్‌లోని బుద్ధవనంను సందర్శించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు శ్రీనివాస్, నారాయణ అమిత్, జెన్‌కో చీఫ్ ఇంజనీర్ మంగేష్‌కుమార్, పెద్దవూర ఆర్‌ఐ దండ శ్రీనివాస్‌రెడ్డి, విజయవిహార్ మేనేజర్ కిరణ్ ఉన్నారు.
స్వాగతం పలికిన కలెక్టర్
నల్లగొండ : సీఎస్ కె. రామకృష్ణారావు సాగర్‌కు వెళ్తూ నల్లగొండలో కాసేపు ఆగారు. ఆయనకు కలెక్టర్ ఇలా త్రిపాఠి బోకే అందజేసి స్వాగతం పలికారు. అంతకుముందు పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. కార్యక్రమంలో ఎస్పీ శరత్‌చంద్ర పవార్, ఎన్నికల జిల్లా సాధారణ పరిశీలకురాలు కొర్ర లక్ష్మి, రాష్ట్ర మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ వైస్ చైర్మన్ భవేష్ మిశ్రా, రెవెన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్, నల్లగొండ ఆర్డీఓ వై. అశోక్‌రెడ్డి, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి రమేష్ తదితరులు పాల్గొన్నారు.
సాగర్‌లో సీఎస్, మాజీ డీజీపీ
సాగర్‌లో సీఎస్, మాజీ డీజీపీ


